Leopard Attack: ఇటీవల సోషల్ మీడియాల వందలాది వైరల్ వీడియోలు చూస్తున్నాం.. ముఖ్యం పాముల వీడియోలు, కుక్కలు, ఏనుగులు, కామెడీకి సంబంధించిన వీడియోలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఇలాంటి వీడియోలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వైరల్ వీడియోలకు సోషల్ మీడియాలో లక్షల వ్యూస్ వస్తున్నారు. అలాగే వేలల్లో లైకులు, కామెంట్లు చేస్తున్నారు. తాజాగా బెంగళూరులోని బన్నెర్‌గట్ బయోలాజికల్ పార్కులో సఫారీ రైడ్ సమయంలో ఓ బాలుడిపై చిరుత పులి అటాక్ చేసింది. బాలుడి చేతిపై పులి దాడి చేయడంతో కాట్లు పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Leopard attacks 13-year-old at Bannerghatta National Park in Bengaluru during a safari ride.
The incident happened this afternoon and the minor was immediately attended to by the park staff and was then taken to a hospital. He was discharged after treatment. pic.twitter.com/Oc7rEubsNH
— Vani Mehrotra (@vani_mehrotra) August 15, 2025
ఓ ఫ్యామిలీ బెంగళూరులోని బన్నెర్‌గట్ బయోలాజికల్ పార్క్‌లో సఫారీ రైడ్ కోసం వెళ్లింది. వాహనంలో సఫారీ రైడ్ చేస్తున్న సమయంలో 12 ఏళ్ల బాలుడిని చిరుతపులి చేతిపై అటాక్ చేసింది. చేతిపై చిరుతపులి గోర్లతో గీరింది.బాలుడు నాన్-ఏసీ బస్సులో ప్రయాణిస్తూ.. కిటికీ వద్ద బయటకు చేతిని పెట్టినట్టు తెలుస్తోంది. ఇది గమనించిన చిరుతపులి బస్సు మీదకు దూకి అతని చేతిని గీచింది. ఈ ఘటనపై అక్కడి అటవీ శాఖ మంత్రి స్పందించారు. పార్కు అధికారులు, పర్యాటకుల భద్రతపై మరింత దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అటవీ శాఖ మంత్రి ఆదేశించారు.
A 13-year-old boy was attacked by a leopard at the Bannerghatta Biological Park in Bengaluru on Friday afternoon when the boy was on a safari along with his parents. The leopard attacked the boy through the window of the vehicle when the driver had stopped for the visitors to see… pic.twitter.com/K4g7Zu08xL
— Karnataka Portfolio (@karnatakaportf) August 15, 2025
ఈ సంఘటనపై బన్నెర్‌గట్ బయోలాజికల్ పార్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.వి. సూర్య సేన్ స్పందించారు. చిరుతపులి బస్సు మీదకు ఎక్కే క్రమంలో బాలుడిపై అటాక్ చేసి చేతిని గీచిందని అన్నారు. ‘బాలుడు నాన్-ఏసీ సఫారీ బస్సులో ప్రయాణిస్తుండగా, అతని చేయి కిటికీ వద్ద బయటకు ఉండడంతో చిరుతపులి అటాక్ చేసి గోర్లతో గీచింది. వెంటనే అతనికి ప్రథమ చికిత్స అందించి.. సంబంధించిన టెస్టులు చేశామని ఆయన తెలిపారు.
ALSO READ: Heavy rains: రాష్ట్రంలో అత్యంత భారీ వర్షం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
పార్కు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిరుతపులులు సఫారీ బస్సుల మీదకు దూకడం, కిటికీల వద్ద ఉన్న సేఫ్టీ జాలీలను పట్టుకోవడం సాధారణంగా జరుగుతూనే ఉంటాయని చెప్పారు. ఈ ప్రమాదాలను తగ్గించడానికి.. అన్ని సఫారీ వాహనాలకు రక్షణ జాలీలు, కెమెరా స్లాట్‌లు అమర్చినట్టు చెప్పారు. అంతేకాక, డ్రైవర్లకు పర్యాటకులను జాగ్రత్తగా ఉంచాలని చెబుతామని తెలిపారు. ఈ సంఘటనపై అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పార్కు అధికారులకు సఫారీ వాహనాల భద్రతను మరింత పటిష్టం చేయాలని, రక్షణ జాలీలను బలోపేతం చేయాలని, ఫోటోగ్రఫీ కోసం ప్రత్యేక స్లాట్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాక, పర్యాటకులకు భద్రతా సూచనలను స్పష్టంగా తెలియజేయాలని, సఫారీ టికెట్లపై జాగ్రత్త సూచనలను ముద్రించాలని సూచించారు.
ALSO READ: AP News: ధర్మవరంలో పాక్ టెర్రరిస్టులు? డైలీ ఆ దేశానికి కాల్స్.. NIA కస్టడీలోకి ఇద్దరు తీవ్రవాదులు
దాదాపు 20 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న బన్నెర్‌గట్ జియోలాజికల్ పార్కులో సఫారీ రైడ్ దక్షిణ భారతదేశంలో మొదటిది. అలాగే దేశంలోనే అతిపెద్దది. ఈ సంఘటన సఫారీలో భద్రతా ప్రమాణాలు, పర్యాటకుల అవగాహనపై మరోసారి చర్చకు దారీ తీసిందని చెప్పవచ్చు. ఈ ఘటన తర్వాత, పార్కు యాజమాన్యం భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెబుతున్నారు.