E-Paper
Advertisement

Assembly Elections 2026: రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. కేరళం, అసోం, పుదుచ్చేరి ఎంతంటే..

Assembly Elections 2026: రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. కేరళం, అసోం, పుదుచ్చేరి ఎంతంటే..
Advertisement

Assembly Elections 2026: అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దీనికితోడు మూడు రాష్ట్రాల్లో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Advertisement

గురువారం అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఎన్నికల సంఘం వివరాలు మేరకు అస్సాంలో 85.38 శాతం కాగా,  2016 నాటి 84.67 శాతం మునుపటి రికార్డును అధిగమించింది.  2021లో 82.04 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.

పుదుచ్చేరిలో 89.83 శాతం ఓటింగ్ నమోదు అయినట్టు తెలిపింది.  2011లో నమోదైన 86.19 శాతం గరిష్ట స్థాయిని అధిగమించింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక కేరళలో 78.03 శాతం పోలింగ్ నమోదైంది. 2021లో 76 శాతం మాత్రమే నమోదు అయ్యింది.

Advertisement

అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పెరిగిన పోలింగ్ శాతం

ఉప ఎన్నికలు జరిగిన కర్ణాటకలోని బాగల్కోట్ నియోజకవర్గంలో 68.70 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇక దావణగెరె సౌత్‌లో 68.55 శాతం కాగా, నాగాలాండ్‌లోని కోరిడాంగ్‌లో 82.21 శాతం, త్రిపురలోని ధర్మనగర్‌లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. మిగతా కమిషనర్లు డాక్టర్ సంధు, డాక్టర్ వివేక్ జోషిలతో కలిసి ఈ ప్రాంతాల పోలింగ్ కేంద్రాలను లైవ్ వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×