E-Paper
Advertisement

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన
Advertisement

Uttar Pradesh: యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ టూర్‌లో భద్రతా లోపం స్పష్టంగా కనిపించింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వేడుకలకు మథుర వస్తుండగా దారిలో భారీ శబ్దంతో విస్పోటనం సంభవించింది. వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు అసలు ఏం జరిగింది?

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు

శ్రీకృష్ణ జయంతిని సందర్భంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మధుర వెళ్తున్నారు. దారిలో స్వామి హరిదాస్ ఆడిటోరియంతో పలు ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ బ్రజ్ తీర్థ వికాస్ పరిషత్ బోర్డు సమావేశం నిర్వహించి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాంటా హోటల్‌కు బయలుదేరారు.

ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

Advertisement

గురువారం సాయంత్రం సుమారు 5:30 గంటలకు గీతా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుండి బయలుదేరి పాగల్ బాబా మోర్, చైతన్య విహార్ మీదుగా ప్రయాణించి హోటల్ వివాంటాకు చేరుకుంది. అంతలో సూర్య నమస్కార్ తిరహా నుండి ముఖ్యమంత్రి వాహన శ్రేణి ఓవర్‌బ్రిడ్జిని సమీపిస్తోంది. ఓవర్‌బ్రిడ్జి సమీపంలో విద్యుత్ స్తంభాల నుండి తీగల్లో అకస్మాత్తుగా పెద్ద పేలుడు సంభవించింది.

ఒక్కసారిగా పొగ దట్టంగా వ్యాపించడం మొదలైంది. ఈ ఘటనతో సీఎం యోగి భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ఆ సన్నివేశాన్ని చూసిన స్థానికులు రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటన గురించి అడగ్గా పైప్‌లైన్‌లను పరిశీలించిన తర్వాత పేలుడుకు సంభవించినట్టు సబ్-డివిజనల్ అధికారి ఒకరు వెల్లడించారు.

ALSO READ: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

Related News

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×