
India’s Most Expensive Car : ఇండియాలో అత్యంత ధనవంతులెవరు ? ఎవరి దగ్గర అత్యంత ఖరీదైన కారు ఉంది ? ఎవరి వార్షిక ఆదాయం ఎక్కువ ? ఇలాంటి వాటి గురించి ఆలోచించేటపుడు టక్కున గుర్తొచ్చే పేరు ముఖేష్ అంబానీ. కానీ.. ముఖేష్ అంబానీ దగ్గర ఇండియాలోనే అత్యంత లగ్జరీ కాదు లేదట. మరి ఎవరి దగ్గర ఉంది ? అంటారా. వీ.ఎస్ రెడ్డి అనే వ్యక్తి వద్ద అత్యంత లగ్జరీ కారు ఉందట.
అత్యంత ఖరీదైన ఆటోమొబైల్స్‌ను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన బెంట్లీ, ఆటోమోటివ్ రంగంలో విలాసవంతమైన దీపంలా నిలుస్తోంది. ప్రస్తుతం, భారతదేశంలో అత్యంత విలాసవంతమైన లగ్జరీ కారు బెంట్లీ ముల్సాన్ EWB సెంటెనరీ ఎడిషన్. ఈ స్పెషల్ ఎడిషన్ ఖరీదు రూ.14 కోట్లు. ఈ కారు ఇటీవల బెంగళూరు రోడ్లపై కనిపించింది. ఈ కారెవరిదా అని ఆరా తీస్తే.. భారతదేశంలోని అతిపెద్ద మెడికల్ న్యూట్రిషన్ తయారీ కంపెనీలలో ఒకటైన బ్రిటిష్ బయోలాజికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ వీ.ఎస్.రెడ్డి ది అని తెలిసింది.
చిన్నప్పటి నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని కార్లను సేకరించాలని ఆయన కల అని వీసీ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బెంట్లీ కారును తాజ్ మహల్ ఆఫ్ కార్స్ గా పోల్చారు. బెంట్లీ.. 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ స్పెషల్ ఎడిషన్ ను రూపొందించారు. కేవలం 100 ఎడిషన్లు తయారు చేయగా.. అందులో ఒకటి వీఎస్ రెడ్డి వద్ద ఉంది. ఈ కారుకు ఎక్స్ టెండెడ్ వీల్ బేస్ ఉంది. అలాగే వెనుక సీటులో కూర్చునేందుకు విలాసవంతంగా ఉంటుంది. సెంటెనరీ గోల్డ్, సెంటెనరీ, బ్లాక్, సెంటెనరీ వైట్ కలర్స్ లో ఈ కార్లను తయారు చేశారు.
సెంటెనరీ ఎడిషన్ ప్రత్యేకంగా శతాబ్ది బ్యాడ్జిని కలిగి ఉంది. ఇందులో గ్రిల్ బ్యాడ్జ్, వీల్ సెంటర్ క్యాప్స్, ట్రెడ్ ప్లేట్ లు ఉన్నాయి. కారు లోపల సీట్లపై పైపింగ్ తో పాటు ప్రత్యేక వెనీర్లు, సెంటెనరీ బ్యాడ్జ్ లు ఉన్నాయి. బెంట్లీ ముల్సాన్ EWB వెనుక సీట్ లో కూర్చునే వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. పవర్-రిక్లైనింగ్ వెనుక సీట్లు, అరుదైన హైడ్ లెదర్‌లో డైమండ్ క్విల్టింగ్ స్టిచింగ్‌తో అమర్చబడి ఉంటాయి. సెంటర్ కన్సోల్ లో పిక్నిక్ టేబుల్ కూడా ఉంటుంది. వాహనంలో లాంబ్‌వూల్-ఫినిష్డ్ ఫ్లోర్ మ్యాట్‌లు ఉంటాయి. 6.75-లీటర్ V8 ఇంజన్, 506 హార్స్‌పవర్ కలిగి ఉండటంతో పాటు.. 1020 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కలసి, బెంట్లీ ముల్సాన్ EWB కేవలం 5.5 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వరకు స్ప్రింట్ చేయగలదు. గంటకు గరిష్టంగా 296 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కెపాసిటీ కలిగి ఉంది.