Idli Google Doodle: గూగుల్ డూడుల్ అనేది అంతర్జాతీయంగా.. అత్యంత ప్రజాధారణ పొందిన సెర్చ్ ఇంజిన్.. గూగుల్ హోమ్ పేజీలో కనిపించే.. ప్రత్యేకమైన లోగో డిజైన్.. ఎప్పటికప్పుడు కొత్త థీమ్‌లతో స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపిస్తుంటుంది.
సాధారణంగా గూగుల్ డూడుల్ ప్రముఖ వ్యక్తుల నివాళిగానో, శాస్త్రీయ ఆవిష్కరణ, చారిత్రక సంఘటనలు, పండుగల సమయాల్లో ప్రత్యేకంగా రూపొందిస్తుంటారు. అయితే ఈరోజు గూగుల్ మరింత ప్రత్యేకంగా నిలించింది. ఎందుకో తెలుసా.. దక్షిణాది వంటకం అయిన ఇడ్లీ రూపంలో గూగుల్ డూడుల్‌ను క్రియోట్ చేశారు.
ఫుడ్ థీమ్‌లో భాగంగా.. గూగుల్ డూడుల్ ఇడ్లీ వేడుక చేశారు. ఈ డూడుల్‌లో ఇడ్లీ తయారీ ప్రక్రియను మరింత అందంగా చూపించారు. ఈ టిఫిన్ తయారీనీ ప్రతిబింభించేలా గూగుల్ అక్షరాలతో చూపించారు. అందులో ఇడ్లీకి కావాల్సిన పదార్ధాలు, తరువాత పిండిని కలపడం, ఆ తర్వాత ఇడ్లీ పాత్రలో ఉడికించడంతో పాటు చివరగా కారం, చట్నీ, సాంబార్ తో అరిటిఆకులో వడ్డించే విధానాన్ని అందులో చూపించారు. ఈ మొత్తం సీక్వెన్స్ ని యానిమేటెడ్ రూపంలో చూపించడం చూసి.. భారతీయ నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు.
గూగుల్ డూడుల్ చూసిన వారంతా సోషల్ మీడియాలో తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇడ్లీతో గూగుల్ డూడుల్ నోరూరిపోతుంది అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇడ్లీ సౌత్ ఇండియాలో మాత్రమే కాదు, ఇప్పుడు గ్లోబల్‌గా కూడా స్టార్ అయింది! అంటూ కామెంట్లు చేస్తున్నారు. చాలామంది తమ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ డిష్ అయిన ఇడ్లీకి.. ఇంత గౌరవం దక్కిందని గర్వపడుతున్నారు. ఇడ్లీ ఉన్న గూగుల్ డూడుల్ చూస్తుంటే నోరూరుతుంది అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సారి ఇడ్లీ థీమ్ డూడుల్ ఫుడ్ లవర్స్‌ను ప్రత్యేకంగా ఆకర్షించిందంటున్నారు. కాగా గూగుల్ డూడుల్ భారతీయ వంటకాలను పెట్టడం ఇది తొలిసారి కాదు.. కొన్నేళ్ల క్రితం పానీపూరి ప్రపంచ రికార్డుకు గుర్తుగా.. ప్రత్యేత డూడుల్‌ను క్రియేట్ చేశారు. దీంతోపాటు పానీపూరి ఆకారంలో ఓ ఇంటరాక్టివ్ గేమ్‌ను కూడా రూపొందించారు. అప్పట్లో ఈ థీమ్ ప్రత్యేక ఆదరణ పొందింది. సోషల్ మీడియోలో తెగ వైరల్ అయ్యింది కూడా.
Also Read: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?
గూగుల్ ప్రతిసారీ సరికొత్త ఆలోచనతో, మన సంస్కృతి సాంప్రదాయాలను, ఆవిష్కరణలను గుర్తుచేసకుంటూ డూడుల్‌లు క్రియేట్ చేస్తుంటారు. ఈసారి ఇడ్లీ రూపంలో డూడుల్ మాత్రం కేవలం కళాత్మకతకే కాకుండా, భారతీయ ఆహార సంస్కృతికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చిందనడంలో సందేహం లేదు.