Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో సీబీఐ విచారణకు ఆదేశించింది సుప్రీంకోర్టు. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను నియమించింది.
కరూర్ ఘటన సీబీఐ చేతికి
తమిళనాడులోని కరూర్ ప్రాంతంలో సెప్టెంబర్ 27న టీవీకె పార్టీ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది మరణించారు. కనీసం 60 మందికి పైగానే గాయపడ్డారు. విజయ్ ర్యాలీ కోసం దాదాపు 10 వేల మంది సామర్థ్యం ఉన్న వేదిక వద్దకు దాదాపు 30 వేల గుమిగూడడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు చెప్పారు.
మధ్యాహ్నం సమయంలో రావాల్సిన టీవీకే అధినేత విజయ్.. సాయంత్రం 7.40 గంటలకు వేదిక వద్దకు చేరుకున్నాడు. వేలాది మంది గంటల తరబడి ఎండలో ఉండడంతో తగినంత ఆహారం, తాగునీరు లేకుండా వేచి చూశారు. ఆయనను చూసేందుకు జనం వేదిక వైపు పరుగులు తీస్తుండగా బారికేడ్ల దగ్గర తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. మహిళలు, పిల్లలు సహా అనేక మంది మరణించారు.
మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు
భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించారని, ఆహారం-తాగునీటికి సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఈ ఘటనకు కారణమైందని అధికారులు తేల్చారు. దీనిపై స్టాలిన్ ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలపై కేసులు నమోదు అయ్యాయి. వెంటనే టీవీకే పార్టీ హైకోర్టు తలుపు తట్టింది. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని పిటిషన్ దాఖలు చేసింది. మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది.
ఈ ఘటనపై అధికార-విపక్షాల మధ్య మాటలు యుద్ధం తారాస్థాయికి చేరింది. దీంతో టీవీకే పార్టీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఆ పిటిషన్ సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ ఎన్వీ అంజరియాలతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతీనెలా కేసు దర్యాప్తు గురించి వివరాలు న్యాయస్థానానికి సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.
ALSO READ: బతికుండగానే చితిపైకి పెద్దాయన.. జరిగినదంతా కళ్లతో చూశాడు
సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను నియమించింది. ఈ కమిటీలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉంటారు. వారు తమిళనాడు కేడర్‌కు చెందినవారు కావచ్చు, కాకపోవచ్చు. ఈ ఘటనపై స్వయంగా సీబీఐ రంగంలోకి దిగడంతో నేతల ఆరోపణలకు బ్రేకులు పడ్డాయి.
ఇదిలా ఉండగా తమిళనాడులో కరూర్ తొక్కిసలాట ఘటనపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కరూర్ తొక్కిసలాటకు డీఎంకే పార్టీ మాజీ నేత సెంథిల్ బాలాజీనే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్. పథకం ప్రకారమే ఆ ప్రాంతంలో తొక్కిసలాట జరిగేలా చేశారని, అందువల్లే 41 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు గుప్పించారు.
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి వస్తుందన్నారు. జనవరి 10 తర్వాత కూటమి ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు నాగేంద్రన్.
కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు
కరూర్ తొక్కిసలాట ఘటనలో మొత్తం 41 మంది మృతి https://t.co/zbFa4D3zUN pic.twitter.com/i8M20ixihb
— BIG TV Breaking News (@bigtvtelugu) October 13, 2025