PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.6000 రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది కేంద్రం ప్రభుత్వం. ఒక్క విడతలో రూ.2 వేల చొప్పున రైతుల అకౌంట్లలో నేరుగా జమ చేస్తారు. పీఎం కిసాన్ 21వ విడత నిధులను కేంద్రం విడుదల చేసింది. ముందుగా వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లోని రైతులకు డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయి.
సెప్టెంబర్ 26, 2025న హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో సుమారు 27 లక్షల మందికి పైగా రైతులకు రూ.540 కోట్లకు పైగా డబ్బులు జమ చేశారు. అలాగే జమ్మూ కశ్మీర్ లోని వరద ప్రభావిత రైతులకు కూడా అక్టోబర్ 7, 2025న 21వ విడత నిధులు ముందస్తుగా విడుదల చేశారు. ఈ రాష్ట్రంలో దాదాపు 8.55 లక్షల మంది రైతులకు రూ.171 కోట్లు ఖాతాల్లో జమ అయ్యాయి. ఇతర రాష్ట్రాల్లోని రైతులకు దీపావళి నాటికి పీఎం కిసాన్ డబ్బులు జమకానున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ, తెలంగాణ సహా మిగిలిన రాష్ట్రాల్లో 21వ విడత డబ్బులు త్వరలోనే జమ అవుతాయి. పీఎం కిసాన్ డబ్బులు దీపావళి పండుగ లోపు లేదా అక్టోబర్ చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని సమా చారం. ఏపీలో అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు అందిస్తుంది. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్దిదారులు రూ.7 వేల వరకు ప్రయోజనం కలగనుంది.
ఈ ప్రక్రియ పూర్తి చేయని రైతుల ఖాతాల్లోకి 21వ విడత డబ్బులు జమకావు. రైతులు వెంటనే తమ పీఎం కిసాన్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6,000 ఆర్థిక సహాయం మూడు వాయిదాలలో అందచేస్తున్నారు.
e-KYC పూర్తి చేయని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవ్వమని అధికారులు తెలిపారు. రైతులు e-KYC పూర్తి చేసేందుకు దగ్గర్లోని సీఎస్సీ కేంద్రం లేదా రైతు సేవా కేంద్రాలను సందర్శించాలి. అలాగే తమ బ్యాంకు అకౌంట్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం డీబీటీ విధానం ద్వారా ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది. ఆధార్ తో లింక్ అయిన ఖాతాల్లో డబ్బులు నేరుగా జమ చేస్తుంది.
రైతు ఆధార్ కార్డు ఫోటోకాపీ, విద్యుత్ బిల్లు, నీటి బిల్లు, టెలిఫోన్ బిల్లు మొదలైన అడ్రస్ ఫ్రూప్, బ్యాంక్ పాస్‌బుక్ ఫోటోకాపీని తీసుకెళ్లి బ్యాంకులో ఆధార్ అనుసంధానం చేయించుకోవచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేస్తున్నప్పుడు లేదా కేవైసీ సమయంలో తప్పుడు పత్రాలను సమర్పిస్తే, వాయిదాలు నిలిచిపోయే అవకాశం ఉంది.
Also Read : EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?
2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. బీహార్‌లోని భాగల్పూర్ రైతులకు పీఎం కిసాన్ యోజన ద్వారా డబ్బులు జమ చేశారు. తొలివిడతలో రూ.9 కోట్ల 80 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.22,000 కోట్ల పైగా నిధులు బదిలీ చేశారు.