EPFO CBT Meeting: ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ సమావేశం ఆఫ్ ట్రస్టీస్(CBT) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చందాదారులు 100 శాతం పీఎఫ్ విత్ డ్రా నిబంధనలను సడలించారు. పీఎఫ్ లో ఉద్యోగి, యజమాని వాటాతో సహా ‘అర్హత కలిగిన బ్యాలెన్స్’లో 100% వరకు ఉపసంహరణకు సీబీటీ అనుమతి ఇచ్చింది. సోమవారం న్యూఢిల్లీలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 238వ సమావేశంలో జరిగింది.
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన సీబీటీ సమావేశంలో పాక్షిత, పూర్తి పీఎఫ్ విత్ డ్రాపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గతంలో నిరుద్యోగం లేదా పదవీ విరమణ విషయంలో మాత్రమే పీఎఫ్ మొత్తం విత్ డ్రాకు అనుమతించేవారు. సభ్యుడు ఉద్యోగం కోల్పోతే ఒక నెల తర్వాత పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75%, 2 నెలల తర్వాత మిగిలిన 25% విత్ డ్రాకు అనుమతించేవారు. పదవీ విరమణ తర్వాత పూర్తి పీఎఫ్ బ్యాలెన్స్ పై ఎటువంటి పరిమితి లేకుండా విత్ డ్రా చేసుకోవచ్చు. భూమి కొనుగోలు, కొత్త ఇంటి నిర్మాణం లేదా EMI చెల్లింపు కోసం పీఎఫ్ ను 90 శాతం వరకు పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయాలు
- తాజాగా ఈపీఎఫ్ఓ సమావేశంలో పాక్షిక విత్ డ్రా కు సంబంధించిన 13 నిబంధనలను ఒకే నిబంధనగా క్రమబద్దీకరించింది. వాటిని మూడు వర్గాలుగా…’ముఖ్యమైన అవసరాలు’ (అనారోగ్యం, విద్య, వివాహం), ‘గృహ అవసరాలు’, ‘ప్రత్యేక పరిస్థితులు’గా వర్గీకరించింది.
- విత్ డ్రా లిమిట్స్ పెంచింది. విద్యావసరాలకు 10 సార్లు, వివాహం కోసం 5 సార్లు పీఎఫ్ విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించింది. గతంలో వివాహం, విద్య కోసం 3 సార్లు మాత్రమే పాక్షిక విత్ డ్రాకు అనుమతించేవారు.
- అన్ని పాక్షిక విత్ డ్రాలకు కనీస సర్వీస్ ను 12 నెలలకు తగ్గించారు.
- ‘ప్రత్యేక పరిస్థితులు’ కింద పాక్షిక విత్ డ్రాకు కారణాలను పేర్కొనవలసిన అవసరం లేదు. గతంలో ‘ప్రత్యేక పరిస్థితులు’ కింద సభ్యుడు పాక్షిక విత్ డ్రా చేసుకునేందుకు కారణాలను స్పష్టం చేయాల్సి ఉండేది.
- పీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తంలో 25% కనీస బ్యాలెన్స్ గా ఉంచేందుకు నిబంధన రూపొందించారు. ఈ కనీస బ్యాలెన్స్ పై EPFO అందించే అధిక వడ్డీ రేటును (8.25%) పొందవచ్చు.
- పాక్షిక విత్ డ్రా క్లెయిమ్‌లకు 100% ఆటో సెటిల్‌మెంట్ చేసింది. ఈ విత్ డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేశారు.
- ఈపీఎఫ్ అకాల తుది సెటిల్‌మెంట్‌ను పొందే కాలాన్ని ప్రస్తుతం ఉన్న 2 నెలల నుండి 12 నెలలకు, తుది పెన్షన్ విత్ డ్రా 2 నెలల నుండి 36 నెలలకు మార్చాలని నిర్ణయించింది. పాక్షిక విత్ డ్రాను సులభతరం చేస్తూనే పొదుపు లేదా పెన్షన్ పై రాజీపడకుండా ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: Tata Capital: బిగ్గెస్ట్ IPO ఆఫ్ ది ఇయర్ గా టాటా క్యాపిటల్ గ్రాండ్ ఎంట్రీ..

Share