BigTV English

NMMS Scholarship: విద్యార్థులకు శుభవార్త.. రూ.48వేల స్కాలర్ షిప్ ఈజీగా పొందండి, అప్లికేషన్ ప్రాసెస్ ఇదే

NMMS Scholarship: విద్యార్థులకు శుభవార్త.. రూ.48వేల స్కాలర్ షిప్ ఈజీగా పొందండి, అప్లికేషన్ ప్రాసెస్ ఇదే

NMMS Scholarship: నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్న ఒక అద్భుతమైన పథకం. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.


ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసే వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. ప్రతి నెలా రూ.1,000 చొప్పున, ఏడాదికి రూ.12,000 ఉపకార వేతనం అందుతోంది. నాలుగు సంవత్సరాలకు కలిపి మొత్తం రూ.48,000 ఆర్థిక సహాయం విద్యార్థుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు లక్ష మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ను అందజేస్తారు.

⦿ NMMS స్కాలర్‌షిప్ పొందడానికి విద్యార్థులు పలు అర్హతలను కలిగి ఉండాలి. విద్యార్థి ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ఈ స్కాలర్ షిప్ స్కీంకు అర్హులు అవుతారు. ఏడో తరగతి ఫైనల్ పరీక్షల్లో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 50% మార్కులు సరిపోతాయి.


⦿ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం (Annual Family Income) రూ.3,50,000 మించకుండా ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన మరే ఇతర స్కాలర్‌షిప్ పథకం కింద లబ్ది పొందుతున్న విద్యార్థులు దీనికి అనర్హులు అవుతారు.

⦿ విద్యార్థుల ఎంపిక ఒక రాష్ట్ర స్థాయి రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. పరీక్షలో ప్రధానంగా రెండు పేపర్లు ఉంటాయి

⦿ Mental Ability Test – మెంటల్ ఎబిలిటీ టెస్ట్): ఇందులో రీజనింగ్, లాజికల్ థింకింగ్ కు సంబంధించిన 90 ప్రశ్నలు ఉంటాయి.

⦿ Aptitude Test – ఆప్టిట్యూడ్ టెస్ట్: ఇందులో 7వ, 8వ తరగతి పాఠ్యాంశాల (సైన్స్, సోషల్, మ్యాథ్స్) ఆధారంగా 90 ప్రశ్నలు ఉంటాయి.

⦿ ప్రతి పేపర్‌కు 90 నిమిషాల సమయం ఉంటుంది. ఈ రెండు పేపర్లలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి విద్యార్థులను ఎంపిక చేస్తారు.

⦿ ముఖ్యమైన డేట్స్..

దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 14

ఎగ్జామ్ తేది: నవంబర్ 23

⦿అప్లికేషన్: విద్యార్థులు చదువుతున్న స్కూల్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

⦿ విద్యార్థులు తమ దరఖాస్తులను నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) ద్వారా లేదా సంబంధిత రాష్ట్ర విద్యా శాఖ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఆఖరి తేదీలోపు మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ALSO READ: Nobel Prize Economics: ఎకానమీలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్.. వారు ఏ దేశాలంటే..?

Related News

EPFO CBT Meeting: ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. 100 శాతం వరకు పీఎఫ్ విత్ డ్రా

Lalu Prasad Yadav: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. లాలూ కుటుంబానికి బిగ్ షాక్, ఎమైందంటే..?

Delhi News: షాకింగ్.. ఢిల్లీలోని ఆ మూడు షాపింగ్ మాల్స్ మూసివేత.. నెక్ట్స్ హైదరాబాద్?

Karur Stampede: టీవీకే పంతం నెగ్గింది.. కరూర్‌ తొక్కిసలాట ఘటన సీబీఐ చేతికి.. సుప్రీంకోర్టు ఆదేశం

Bihar News: బతికుండగానే చితిపైకి పెద్దాయన.. అంతా కళ్లతో చూశాడు, అసలు మేటరేంటి?

PM Kisan Samman Nidhi: ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Big Stories

×