E-Paper
Advertisement

Bemetera Factory Blast: గన్ పౌడర్ తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఒకరు మృతి

Bemetera Factory Blast: గన్ పౌడర్ తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఒకరు మృతి
Advertisement

Chhattisgarh Gunpowder Factory Blast(Telugu news live): ఛత్తీస్ గఢ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బెమెతెరా జిల్లాలోని గన్ పౌడర్ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఒకరు మరణించగా.. ఆరుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మరికొందరికి తీవ్రగాయాలైనట్లు సమాచారం.

భారీ పేలుడు ధాటికి చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల్ని రాయ్ పూర్ ఎయిమ్స్ కు తరలించారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న రాయ్ పూర్, దుర్గ్ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి.

Advertisement

Also Read :11కు చేరిన మృతుల సంఖ్య, ఇంకా శిథిలాల కిందే..

ప్రమాద సమయంలో గన్ పౌడర్ ఫ్యాక్టరీలో సుమారు 100 మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఫ్యాక్టరీలో పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఫ్యాక్టరీ నుంచి వెలువడిన నల్లటి పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్ముకుంది. ప్రమాదంలో మరణించిన వారి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలిపారు.

Advertisement

ఘటనపై ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణు దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల సహాయం ప్రకటించారు.

Related News

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

Advertisement
×