E-Paper
Advertisement

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

Ration: దేశంలోని పలు ప్రాంతాలపై ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరాదిలో కుండపోత వర్షాలు కుమ్ముస్తున్నాయి. దక్షిణాదిలో మాత్రం వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న కేంద్రం, కీలక నిర్ణయం తీసుకుంది.

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు-ప్రజలకు ఆహార భద్రతను కల్పించేందుకు రానున్న ఆగస్టు నుంచి మూడు నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రాలు రేషన్ పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆగస్టు ఒకటి నుంచి లబ్ధిదారులకు మూడు నెలలకు సరిపడిన బియ్యాన్ని ఒకేసారి అందేలా చర్యలు చేపడుతున్నారు.

Advertisement

ఒకేసారి మూడునెలల కోటా- నార్మల్‌గా అయితే ప్రతీ నెల ఒకటి నుంచి రెండు వారాలు పాటు రేషన్ దుకాణాలు పని చేస్తాయి. ప్రత్యేక పంపిణీ నేపథ్యంలో ఆగస్టు నెల అంతా రేషన్ షాపులు తెరిచి ఉంచాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇక లబ్ధిదారులు తమకు అనుకూలం రోజున వెళ్లి రేషన్ తీసుకునే అవకాశం ఉంది.

ఆగష్టు నుంచి అమలు-మూడు నెలల కోటా ఒకేసారి ఇవ్వడంతో లబ్దిదారులు సరకు తీసుకునే సమయంలో మూడు సార్లు వేలి ముద్రలు వేయాల్సి ఉంటుందని చెబుతున్నారు అధికారులు. అదే సమయంలో రేషన్‌కార్డు దారులు ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది. ఈ-కేవైసీ చేసుకోని వారికి ఈ నెల 31 గడువు నిర్ణయించారు.

Advertisement

 ఎల్ నినో ఎఫెక్ట్- ఈ-కేవైసీ అప్డేట్ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా చేసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఆ లెక్కన ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున మూడు నెలలకు 18 కిలోల అందనుంది. ఒక ఫ్యామిలీ ముగ్గురుంటే 36 కేజీల బియ్యం రానుంది. రెండేళ్లుగా దీనిపై ప్రచారం చేస్తున్నప్పటికీ 40 శాతం మంది ఈ-కేవైసీ చేయించుకోలేదు.

ALSO READ: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ సేవలు అందుబాటులో ఉండడంతో 100 శాతం ఈ-కేవైసీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. ఇక కొత్త రేషన్ కార్డుల్లో పేర్లు నమోదు చేసుకోవాల్సినవారికి జులై 31 లోగా ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×