E-Paper
Advertisement

Delhi: ఎబోలా‌పై కేంద్రం హెచ్చరికలు.. ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో అడ్వైజరీ జారీ

Delhi: ఎబోలా‌పై కేంద్రం హెచ్చరికలు.. ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో అడ్వైజరీ జారీ
Advertisement

Delhi: ప్రపంచ ఆరోగ్య సంస్థ -WHO ఎబోలా హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సూచన చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులు, ఓడరేవులకు హెచ్చరిక జారీ చేసింది.

ప్రపంచ ఆరోగ్య శాఖ హెచ్చరికతో ఎబోలా‌పై కేంద్రం అప్రమత్తం

Advertisement

ఎబోలా లక్షణాలు కోసం పటిష్టమైన స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని ఉత్తర్వులు పేర్కొంది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, సుడాన్ దేశాలలో ఆయా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. భారత్‌లో ఎబోలా కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది. ఎబోలా వైరస్ వ్యాధి కి సంబంధించి చర్యలు అంచనా వేయడానికి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీవాస్తవ అధ్యక్షతన సమావేశం జరిగింది.

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖ కార్యదర్శులు హాజరయ్యారు. అన్ని స్థాయిలలో సన్నద్ధతను కొనసాగించాలని ఆరోగ్య శాఖ సూచన చేసింది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చినవారు మొదలు స్క్రీనింగ్, క్వారంటైన్ ప్రోటోకాల్‌లు, కేసుల నిర్వహణ, రెఫరల్ వ్యవస్థలు, ప్రయోగశాల పరీక్షలకు సంబంధించిన విధానాలను ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పంచుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.

Advertisement

ఎబోలా పై హెచ్చరికలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

2014లో ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో భారత్ విజయవంతమైంది. ఎబోలా సోకినవారికి జ్వరం, నీరసం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, విరేచనాలు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇప్పటివరకు కాంగోలోని ఇటూరి, నార్త్ కివు ఉత్తర ప్రావిన్సులలో 51 కేసులు నమోదు అయ్యాయి. ఉగాండాలో రెండు కేసులు నిర్ధారించారు. ఈ వ్యాప్తికి సంబంధించి 139 అనుమానిత మరణాలు, దాదాపు 600 అనుమానిత కేసులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వైరస్ కట్టడికి టీకాలు ఏవీ అందుబాటులో లేవు. వీటిపై ప్రయోగాలు జరుగుతున్నాయి.

ALSO READ: మోదీ కేబినెట్ భేటీ.. మంత్రివర్గంలో మార్పులు-చేర్పులు, వారికి మాత్రమే చోటు

పలు దేశాల్లో ఎబోలా కేసులు కలకలం రేపుతున్న నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు కీలక అడ్వైజరీ జారీ చేశారు. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌ నుంచి వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యానికి సంబంధించి చిన్న సమస్యలు కనిపిస్తే వెంటనే ఎయిర్‌పోర్టు వైద్యసిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రయాణం చేసిన 21 రోజుల్లోగా వ్యాధి లక్షణాలు కనిపిస్తే స్థానిక వైద్య అధికారులకు తెలియజేయాలని సూచించారు.

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×