E-Paper
Advertisement

తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్!

తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్!
Advertisement

Haritha Hotels: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి, పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో సగం పూర్తయిన కరీంనగర్, సిరిసిల్ల, కొత్తగూడెం, కిన్నెరసాని, ఆలంపూర్, ట్రైబల్ సర్క్యూట్ ఆరు హరిత హోటల్ ప్రాజెక్టులను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ పద్ధతిలో పూర్తి చేసి, నిర్వహించేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీ టీడీసీ) బుధవారం టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చింది.

వార్షిక లీజు 56 లక్షలు

కరీంనగర్ హరిత హోటల్ ను బీఓటీ పద్దతిలో 33 ఏళ్లకు లీజుకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 2 ఎకరాల స్ధలంలో 20కోట్లతో జీఫ్లస్ నిర్మాణం చేయడం జరిగిందని, అదనంగా 26.10కోట్లతో జీప్లస్ 3 వరకు నిర్మాణంను 24 నెల్లలో పూర్తి చేయాలని, వార్షిక లీజు 56లక్షలు అని, ప్రతి ఏటా 5శాతం పెరుగుదల ఉంటుందని టెండర్ లో పేర్కొన్నారు. సిరిసిల్ల హరిత హోటల్ సైతం బీఓటి పద్దతిలో 33 ఏళ్లకు లీజు కాలం అని, 1.30 ఎకరాల స్ధలంలో 9కోట్లతో జీప్లస్ 1 భవన నిర్మాణం, అదనంగా రూ.10.20కోట్లతో జీప్లస్2 లేదా జీప్లస్ 3 వరకు నిర్మాణం 24 నెలల్లో పూర్తి చేయాలని , వార్షిక లీజు రూ.5.51లక్షలుగా పేర్కొంది.

Advertisement

Also Read: వాట‌ర్ బాయ్ గా వాడుకున్నారు, ఇప్పుడు డ్రెస్సింగ్ రూంలో వెలివేశారు..దీన స్థితిలో అర్జున్ టెండూల్క‌ర్

15 ఏళ్ల కాలపరిమితి..

కొత్తగూడెం హోటల్ ను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విధానం కింద 15 ఏళ్ల కాలపరిమితి అని, 8 ఎకరాల స్ధలంలో రూ.12.36కోట్లతో నిర్మించిన జీప్లస్1 భవన్, ఒప్పందం జరిగిన 6 నెలల్లోగా పనులు పూర్తి చేసి ప్రారంభించాలని, అంచనా వ్యయం రూ.7.6కోట్లుగా టెండర్ లో పేర్కొన్నారు. వార్షిక లీజు అద్దె 80లక్షలు అని స్పష్టం చేశారు. కిన్నెరసాని హరిత హోటల్(ఇకో టూరిజం) ఓఅండ్ఎం విధానంలో 15 ఏళ్ల కాలపరిమితి అని, 10కోట్లతో జీ ప్లస్ 1 భవన్, ఒప్పందం జరిగిన 3 నెలల్లోకా పనులు పూర్తి చేసి ప్రారంభించాలని అదనపు పెట్టుబడి 3కోట్లు అని,వార్షిక లీజు రూ.24.40లక్షలుగా పేర్కొన్నారు. ఆలంపూర్ హరిత హోటల్ ఓఅండ్ఎం విధానంలో 5 ఏళ్ల కాలపరిమితిఅని, జీప్లస్ 2 భవనం, ఒప్పందం జరిగిన 3 నెలల్లోకా అదనంగా కోటి పెట్టుబడితో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. వార్షిక అద్దె 11.60లక్షలుగా పేర్కొన్నారు.

అంతర్జాతీయ స్థాయి వసతులు

Advertisement

ట్రైబల్ సర్క్యూట్(గిరిజన సర్క్యూట్).. గట్టమ్మ, మేడారం, తాడ్వాయి, మల్లూరు, బొగతలోని పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఓఅండ్ఎం విధానంలో 5 ఏళ్ల కాలపరిమితి, వార్షిక లీజు 86.30లక్షలుగా పేర్కొన్నారు. ఇందులో గట్టమ్మ లీజు 7,17,446గా, మేడారం రూ.17,77,970, తాడ్వాయి రూ.28,38,482, మల్లూరు రూ.4,84,826, బొగత రూ.28,11,362 గా నిర్ణయించినట్లు టెండర్ లో పేర్కొన్నారు. బిడ్ సెక్యూరిటీ 43.15 లక్షలుగా స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వేములవాడ, కాళేశ్వరం, ధర్మపురి, కొండగట్టు, భద్రాచలం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు వచ్చే భక్తులకు, సందర్శకులకు అంతర్జాతీయ స్థాయి వసతులు అందుబాటులోకి రానున్నాయి. హోటల్ రంగంలో కనీస అనుభవం, ఆర్థిక అర్హతలు కలిగిన సంస్థలు ఈ టెండర్లలో పాల్గొనడానికి అర్హులని తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీటీడీసీ) పేర్కొంది.

Also Read: రచ్చ కెక్కిన జవహార్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యవహారం.. రాంకీ సంస్థను బ్యాన్ చేయాలని డిమాండ్!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×