BigTV English

Rahul Gandhi : భారత్ జోడో న్యాయ యాత్ర‌ రూట్ మ్యాప్‌లో మార్పులు.. మమతా వ్యాఖ్యలే కారణమా?

Rahul Gandhi : కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న భారత్‌ జోడో న్యాయయాత్ర అస్సాం నుంచి పశ్చిమబెంగాల్‌ల్లోకి ప్రవేశించింది. అయితే యాత్రలో చివరి నిమిషంలో కీలక మార్పు జరిగింది. ముందుగా ప్రతిపాదించిన ప్రాంతాల్లో కాకుండా ఉత్తరాది జిల్లాల మీదుగా యాత్రను కొనసాగేలా మార్పులు చేశారు. యాత్రను త్వరగా ముగించి బిహార్‌ రాష్ట్రంలోకి వెళ్లేలా మార్పులు చేశారు.

Rahul Gandhi :  భారత్ జోడో న్యాయ యాత్ర‌ రూట్ మ్యాప్‌లో మార్పులు.. మమతా వ్యాఖ్యలే కారణమా?

Rahul Gandhi : కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న భారత్‌ జోడో న్యాయయాత్ర అస్సాం నుంచి పశ్చిమబెంగాల్‌ల్లోకి ప్రవేశించింది. అయితే యాత్రలో చివరి నిమిషంలో కీలక మార్పు జరిగింది. ముందుగా ప్రతిపాదించిన ప్రాంతాల్లో కాకుండా ఉత్తరాది జిల్లాల మీదుగా యాత్రను కొనసాగేలా మార్పులు చేశారు. యాత్రను త్వరగా ముగించి బిహార్‌ రాష్ట్రంలోకి వెళ్లేలా మార్పులు చేశారు.


మరో వారం రోజుల్లో న్యాయయాత్ర మళ్లీ బెంగాల్‌లోకి ప్రవేశిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులు అంచనా వేస్తున్నారు. ముర్షిదాబాద్‌, మాల్దా, నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని సమాచారం.ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉంది. సీపీఐ(ఎం)తో పాటు ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న ఇతర పార్టీల నేతలు ఈ యాత్రలో పాల్గొన్నారు. కానీ యాత్రలో టీఎంసీ నాయకులు మాత్రం పాల్గొనలేదు.

పశ్చిమబెంగాల్‌లో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు, సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే న్యాయయాత్ర మార్గంలో మార్పులు చేసినట్లు సమాచారం. సీట్ల సర్దుబాటుపై తాను ఒక ప్రతిపాదన చేశానని మమత తెలిపింది. అయితే తన ప్రతిపాదనలను కాంగ్రెస్‌ తోసిపుచ్చిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆమె ప్రకటించారు.రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలో చర్చలు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తం అని ఆమె సృష్టం చేశారు . లోక్ సభ సీట్ల కోసం కాంగ్రెస్‌లో ఏ ఒక్కరితోనూ తాను మాట్లాడలేదని తెలిపారు. ఇకపై రాష్ట్రంలో కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధం ఉండబోదని వెల్లడించారు. జాతీయస్థాయిలో సంబంధాల పైనా పునరాలోచిస్తానని ఆమె వ్యాఖ్యానించారు.


బీజేపీని ఎదుర్కోవడానికి వివిధ రాజకీయ పార్టీలను కాంగ్రెస్ ఏకతాటిపై తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అయితే తాజాగా మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నాయకులు నిరాశకు గురైయ్యారు . ఆమ్‌ఆద్మీ కూడా పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ ప్రకటించారు. పంజాబ్‌ సహాదిల్లీ, గోవా, హరియాణా, గుజరాత్‌లలో సీట్ల సర్దుబాటు చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో ఆయన ఈ ప్రకటన చేశారు. మరోవైపు కాంగ్రెస్‌తో సమాజ్‌వాదీ పార్టీ మధ్య సయోధ్య కుదరడం లేదు. మహారాష్ట్రల్లో సీట్ల సర్దుబాటు అంశంపై కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ ల మధ్య అనిశ్చత ఏర్పడింది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×