BigTV English

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss Telugu 9: మొదట్లో చప్పగా అనిపించిన బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ రోజురోజుకి ఆసక్తిగా మారుతోంది. తొలి నుంచి వివాదాలతో నడుస్తున్న హౌజ్ ని ఎమోషన్స్ గా మార్చాడు. ఫ్యామిలీ సెంటిమెంట్ తో కంటెస్టెంట్ ని సైలెంట్ చేశాడు. అలా డే 16, 17 మొత్తం సెంటిమెంట్స్ మధ్య సాగాయి. 18వ ఎపిసోడ్ వచ్చేసింది. హౌజ్ సంజన మరోసారి హౌజ్ మేట్స్ వీక్ నెస్ తో ఆడుకుంది. సుమన్ శెట్టి కోసం పంపించిన సిగరేట్ ని, మరోవైపు తనూజ కాఫీ బాటిల్ దాచేసింది. వారద్దరు ఎంతసేపు బతిమాలిన ఇవ్వలేదు. దీంతో తనూజ సీరియస్ అయ్యింది. ఆ కోపాని పాపం రాము రాథోడ్ పై చూపించింది.


రాముపై ఫైర్

రెండు మూడు సార్లు హౌజ్ టీ కాఫీలు ఇవ్వోద్దంటూ.. ఆవేశం చూపించింది. దీంతో రాము రాథోడ్ ఆమె మాటలకు ఫీల్ అయ్యాడు. ఇష్టమున్నట్టు అంటే పడటానికి నేనేమైనా ఆమె అసిస్టెంట్ నా అంటూ బాధను వ్యక్తం చేశాడు.దీంతో తునూజకు ఎంతో క్లోజ్ అయినా ఇమ్మాన్యుయేల్ రామ్ తరపున స్టాండ్ తీసుకున్నాడు. ఎవరి మీదో ఉన్న కోపాన్ని.. రాము పై చూపించడం కరెక్ట్ కాదంటూ అతడిని ఓదర్చాడు. తినేవాడిపై అలా అరవడం అసలు కరెక్ట్ కాదని తనూజ తీరుని తప్పుబట్టాడు. ఇమ్మాన్యుయేల్ అలా అనడంతో తనూజ హార్ట్ అయయింది. ఎవరూ తనని అర్థం చేసుకోవడం లేదంటూ కన్నీరు పెట్టుకుంది. హౌజ్ లోకి అందరికి అందరూ ఉన్నారని, తనకు ఎవరు లేరంటూ ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత ఇమ్మూ తనూజని ఓదార్చాడు.

హౌజ్ లో అగ్నీ పరీక్ష వారియర్స్

అగ్నీ పరీక్ష కంటెస్టెంట్స్ హౌజ్ లోకి వచ్చారు.షాకిబ్, దవ్వ నిఖిత, నాగ ప్రశాంత్, అనూష రత్నంలు రాగా.. వారిలో ఇద్దరికి మాత్రం వైల్డ్ కార్డ ఎంట్రీ ఉంటుంది. అయితే అందులో ఎవరూ రావాలనే నిర్ణయాన్ని బిగ్ బాస్ కంటె్టెంట్స్ చేతికి అప్పగించారు. ఈ సందర్భంగా వారు ఇంటికి రావడానికి ఉన్న హర్హతలు ఏంటీ.. హౌజ్ లోకి వస్తూ వస్తూ.. కొత్తగా ఏం తీసుకువస్తారనే అప్పిల్ చేసుకుని హౌజ్ మేట్స్ ని మెప్పించాలని చెప్పారు. అలా మొదట కంటెస్టెంట్ నాగ తన అప్పిల్ చేసుకున్నాడు. అగ్నీ పరీక్షలో టీం ప్లేయర్ గా టీం లీడర్ గా ఎంవీపీ తెచ్చుకున్నాడు.


ఇక నేను హౌజ్ లోకి వస్తే.. గేమ్ స్ట్రాటసీని ఎలా మార్చాడం. హౌజ్ లో బూస్ట్ నింపుతూ మంచి ఎంటర్టైన్మెంట్ తీసుకువస్తానన్నాడు. ఆ తర్వాత దివ్వ వచ్చింది.. ఈ హౌజ్ లో సెన్సాఫ్ క్లారిటీ మిస్ అయ్యింది. అదే నేను హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ తో వచ్చి తన వైల్డ్ గేమ్ చూపిస్తానని చెప్పింది. ఆ తర్వాత షాకిబ్ వచ్చాడు. హౌజ్ లో ఎంటర్టైన్మెంట్ లేదు.. అది నేను తీసుకువస్తాను అప్పీల్ చేసుకున్నాడు. ఆ తర్వాత అనూష వచ్చింది.. బిగ్ బాస్ ఫుల్ మీల్స్ ప్యాకేజ్. నేనంటే రియాలిటీతో ఆడి ఆడియన్స్ మనసు గెలుచుకోవడం ముఖ్యం. అందుకే నా 100 శాతం ఎఫర్ట్స్ పెట్టి హెల్తీ హ్యుమర్ తో అలరిస్తుంటారు.

శ్రీజ దమ్ముకి వరుస కౌంటర్స్

ఆ తర్వాత అనూషని ప్రశ్నించి తన మనుసలో మాటను బయటపెట్టింది. డిమోన్ పవన్.. ఎవరైనా అనవసరం కారణాలతో నిన్ను నామినేట్ చేస్తే.. ఆ సిచ్చ్యూవేషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని ప్రశ్నించగా.. అనూష దీనికి తన వివరణ ఇచ్చుకుంది. ఆ తర్వాత శ్రీజ.. హౌజ్ మేట్స్ ఎవరినైనా స్వాప చేయాలనుకుంటే ఎవరిని చేస్తావ్ అని అడగ్గా.. నిన్నే శ్రీజ అంటూ కౌంటరిచ్చింది. నీ ఇగో సంత్రప్తి చెందకపోతే పుండుపై పెన్ను గుచ్చినట్లు పొడుస్తూనే ఉంటావ్. ఎక్కడ అన్ రికార్డు, ఆఫ్ రికార్డు ఇన్ఫార్మేషన్ పెట్టాలనే మినిమమ్ కామన్ సెన్స్ లేదు. 24 గంటలు నెగిటివ్ ఎనర్జీతో ఉండే నీతోనే స్వాప్ చేసుకుంటాను అంటూ శ్రీజకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత నాగని అడగ్గా.. పవన్ కళ్యాణ్ తో చేసుకుంటాను అన్నాడు. అతడు గేమ్ ఇంతవరకు కనిపించలేదు. అందుకే అతడిని స్వాప్ చేసుకుని హౌజ్ లో అన్ని విధాలుగా ఆడి కంటెంట్ ఇస్తాను అన్నాడు. అనంతరం దివ్య.. శ్రీజను స్వాప్ చేసుకుంటాను అంది. బిగ్ బాస్ కంటే కూడా తనే కెప్టెన్ అన్నంత యాటిట్యూడ్ తో శ్రీజ కనిపిస్తుంది.

హౌజ్ లో స్పైసీ తక్కువైంది..

అందుకే తనని స్వాప్ చేసుకుని.. అన్ని టాస్క్ ల్లో యాక్టివ్ గా ఉంటాను అని వివరణ ఇచ్చింది. షాకిబ్ అడగ్గా.. తాను ఎవరిని స్వాప్ చేసుకోను అన్నాడు. ఇక్కడ ఎక్ ట్రా స్పైసీ కావాలి కాబట్టి.. నేను యాడ్ అవుతానన్నాడు. స్వాప్ అంటే పవన్ కళ్యాణ్ తో అని చెప్పాడు. అసలు అతడు కనిపించడం లేదు.. అదే నేను ఉంటే అతడి కంటే చాలా ఎక్కువ కనిపిస్తా. కాంపిటిషన్ గా కాకుండ.. నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇక నేను అగ్నీ పరీక్ష నుంచి వచ్చాను కాబట్టి..నేను టెనెంట్ గా టీంకి వెళ్తా అన్నాడు. ఆ తర్వాత ఇంటి నుంచి వారు బయటకు వెళ్లిపోయారు.

దివ్య వైల్డ్ ఎంట్రీ

ఆ తర్వాత వైల్డ్ కార్డ్ కోసం అగ్నీ పరీక్షలో ఈ నలుగురిలో ఎవరూ ఇంట్లోకి రావాలనుకుంటున్నారో.. ఒక్కొక్కొ కంటెస్టెంట్ ఒపెనియన్ తీసుకున్నాడు బిగ్ బాస్. ఈ మేరకు ఓటింగ్ పెట్టాడు. ఒక్కొక్కరి పేరుతో ఎన్వాలప్ ఇచ్చి ఓటింగ్ పెట్టారు. అందులో ఉన్న కంటెస్టెంట్స్ లో ఇద్దరికి రైట్ మార్క్ వేయాలని సూచించారు. అలా హౌజ్ లోని 13 మంది తమ ఓటింగ్ పూర్తి చేశారు. అలా అందరికి కంటే తక్కవ వచ్చిన దివ్య.. బిగ్ బాస్ హౌజ్ లోకి వైల్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆమెను చూసి అంత షాక్ అయ్యారు. అందరికి కంటే నాకే తక్కువ ఒట్లు వేశారు కదా.. హౌజ్ లో నా ఆట ఏంటో చూపిస్తా అని వచ్చరాగానే సవాలు విసిరింది.

రెండు వారాలు బయట ఉండి చూసిన ఆమె తమ ఆటపై రివ్యూ అడిగారు.ఆమె వచ్చి రాగానే ఇంట్లో ట్రాయాంగిల్ లవ్ ట్రాక్ నడుస్తుంది.. కానీ అప్పుడప్పుడు అది ట్రాక్ తప్పి స్క్వేర్ అవుతుందని చెప్పింది. కళ్యాణ్, డిమోన్ మధ్య రీతూతో లవ్ ట్రాక్ కనిపిస్తుందని చెప్పింది. ఇక అదే టైంలో హౌజ్ లో అందరి వస్తువులు దొంగతనం చేస్తున్న సంజనకి ఓ ఝలక్ ఇవ్వాలని తనూజ, రీతూ ప్లాన్ చేశారు. ఆమె లిప్టిక్, మేకప్ వస్తువులను దాచి సంజనకి చుక్కలు చూపించారు.

Related News

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Big Stories

×