Tanushree Dutta: బాలీవుడ్ వివాదాస్పద బ్యూటీ తనుశ్రీ దత్త గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో అల్లరి పిడుగు, వీరభద్ర సినిమాల్లో బాలయ్యతో రొమాన్స్ చేసి మెప్పించింది. అందాల ఆరబోత చేసిన సరే ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేసిన దాఖలాలు లేవు. ఇక మీటూ ఉద్యమానికి ఆజ్యం పోసిన హీరోయిన్ తనుశ్రీ దత్తా. ఇప్పటికీ ఆ ఉద్యమం కోసమే పోరాడుతుంది.. నిత్యం ఏదో ఒక టాపిక్ పై మాట్లాడుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె బిగ్ బాస్ రియాల్టీ షో గురించి సంచలన విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో బిగ్ బాస్ పై నెగిటివ్ ట్రోల్స్ కూడా మొదలయ్యాయిని తెలుస్తుంది.
బాలీవుడ్ బ్యూటీ తను శ్రీ దత్త ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విషయం అందరికీ తెలుసు. వీడియో వైరల్ అవ్వడంతో ఈమె మరోసారి వార్తల్లో నిలిచింది. ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ పై సంచలన కామెంట్స్ చేసింది. అసలు అలాంటి షోకు తాను ఎన్ని కోట్లు ఇచ్చినా వెళ్లే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చింది. అదొక దారుణమైన షో. పేరుకే బిగ్ బాస్ కానీ లోపల మాత్రం గలీజ్ పనులు జరుగుతున్నాయని బిగ్ బాస్ బాగోతాన్ని బయటపెట్టింది తను శ్రీ.. 11 ఏళ్లుగా నాకు బిగ్ బాస్ నుంచి ఆఫర్ వస్తూనే ఉంది.. ఇప్పుడే కాదు ఎప్పటికీ అలాంటి షో కి నేను వెళ్ళను అని తేల్చి చెప్పేసింది హాట్ బ్యూటీ.
Also Read : నటి మీనా కన్నీళ్లు.. భర్త చనిపోయిన వారానికే ఆ వార్తలు..?
ఒకప్పుడు సినిమాల తో బిజీగా ఉన్న ఈమె ఈమధ్య ఏదో ఒక వార్తతో నెట్టింటా వైరల్ గా అవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ అమ్మడు.. బిగ్ బాస్ తనకిచ్చిన ఆఫర్ గురించి బయట పెట్టింది. నన్ను బిగ్ బాస్ యాజమాన్యం షోకు రావాలని కోరుతుంది. వాళ్లు నా స్థాయి నటిని కూడా కోరుతుంది. కానీ, నేను రాను అని చెప్పాను. ఎందుకంటే అక్కడ ఒకే రూమ్ లో ఆడవారు, మగవారు కలిసి ఒకే బెడ్ పై పడుకుంటారు. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి కొట్టుకుంటారు తిట్టుకుంటారు.. అలాగే రొమాన్స్ మొదలు పెడతారు ఇవన్నీ నాకు నచ్చలేదు. కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చిన సరే నేను 11 ఏళ్లుగా బిగ్ బాస్ కి వెళ్లకుండా దాటేస్తున్నాను అని ఆమె ఇంటర్వ్యూ లో బయటపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాది అంత చీప్ క్యారెక్టర్ కాదు అని తనుశ్రీ అంటున్నారు.. ఇప్పటి వరకైతే బిగ్ బాస్ వెళ్లాలని ఆలోచన లేదు ఇకముందు కూడా రాదు అని ఆమె తేల్చి చెప్పేసారు. మొత్తానికి ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది..