Bigg Boss 9: బిగ్ బాస్ (Bigg Boss).. ఈ కార్యక్రమం గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు సొంతం చేసుకున్న ఈ షో.. అటు హిందీలో 19వ సీజన్ మొదలవగా.. ఇటు తెలుగులో కూడా తొమ్మిదవ సీజన్ ప్రారంభమైంది. అయితే మిగతా సీజన్లలో లాగా కాకుండా ఈ సీజన్లో ఏకంగా 6 మంది కామనర్స్ ను హౌస్ లోకి తీసుకొచ్చారు.. వాస్తవానికి ఈ 6 మందిని ఎంపిక చేయడానికి “అగ్నిపరీక్ష” అంటూ ఒక మిని షో నిర్వహించి.. అందులో చిత్రవిచిత్రమైన టాస్కులు పెట్టి అందులో నెగ్గిన వారిని ఇప్పుడు హౌస్ లోకి తీసుకోవడం జరిగింది.
అలా 9 మంది సెలబ్రిటీలు.. 6 మంది కామనర్స్ హౌస్ లో టైటిల్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కామనర్స్ లోనే కాదు అటు సెలబ్రిటీలలో మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 లో మోనార్క్ అనిపించుకున్నారు హరిత హరీష్ (Haritha Harish) . మొదటి వారమే టార్గెట్ అయిన ఆయనకు ఇప్పటికీ కూడా సెలబ్రిటీస్ తో పాటు కామనర్స్ కూడా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈయనను ఎలిమినేట్ చేయాలని కొంతమంది కోరగా.. ఇలాంటి వ్యక్తి హౌస్ కి కావాలి అని చాలామంది ఆయనకు సపోర్టుగా కూడా నిలుస్తున్నారు. ఇలాంటి సమయంలో తన భర్తపై నెగెటివిటీ పెరిగిపోతున్న కారణంగా మాస్క్ మ్యాన్ హరీష్ భార్య హరిత తాజాగా ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ అసలు విషయాన్ని బయట పెట్టింది.
భార్యను కొట్టానంటూ నిజం ఒప్పుకున్న హరీష్..
బిగ్ బాస్ అగ్నిపరీక్ష కార్యక్రమంలో ముఖానికి మాస్క్ పెట్టుకుని మొదట అందరిలో కన్ఫ్యూజ్ క్రియేట్ చేసిన ఈయన ముక్కు సూటిగా మాట్లాడి జడ్జిలనే ఆగం చేశాడు. తనలో సగమైన భార్య కోసం తన పేరును హరిత హరీష్ గా కూడా మార్చుకున్నాడు. అంతేకాదు కోపం వచ్చి తన భార్యపై చేయి చేసుకున్నట్లు కూడా అగ్నిపరీక్ష షోలో తెలపడంతో భార్యపై చేయి చేసుకునే అంత మూర్ఖుడివా ? దుర్మార్గుడివా? అంటూ ఆయనను చాలా మంది తిట్టిపోశారు. అంతేకాదు బిగ్ బాస్ షో చరిత్రలోనే నాలుగు రోజులపాటు నిరాహారదీక్ష చేసిన ఏకైక కంటెస్టెంట్ గా కూడా నిలిచారు హరిత హరీష్.
విమర్శలకు చెక్ పెట్టిన హరిత..
ఇదిలా ఉండగా ఈయనపై నెగెటివిటీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన సతీమణి హరిత (Haritha)మాట్లాడుతూ.. “ఇదేమైనా గుడిలో గంటా? లేక స్కూల్ బెల్లా? ఉదయం, సాయంత్రం కొట్టడానికి.. ప్రతి కుటుంబంలో కూడా గొడవలు ఉంటాయి అయితే ఆయన నన్ను కొట్టిన సంఘటన మాకే పెద్దగా గుర్తులేదు. అయినా సరే షో కోసం అబద్ధం చెప్పకుండా ఆయన ఇంకా దానిని గుర్తు పెట్టుకొని మరీ చెప్పాడు. నిజానికి మనసులో ఏది దాచుకోడు. అన్ని తిరిగిచ్చే రకం. మా పెళ్ళయి 15 సంవత్సరాలవుతోంది. ఈ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము. నా భర్త చాలా మంచివాడు. కావాలనే ఆయనపై నెగెటివిటీ క్రియేట్ చేస్తున్నారు. మీకందరికీ మోనార్కులా కనిపించవచ్చు. కానీ ఆయనలో కామెడీ యాంగిల్ కూడా ఉంది. అది ఇంకా బయటకు రాలేదు. దయచేసి ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది” అంటూ హరిత చెప్పుకొచ్చింది. మొత్తానికైతే గంభీరంగా కనిపిస్తూ అందరి చేత విమర్శలు ఎదుర్కొంటున్న హరీష్ ఇంత మంచివాడు అని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా హరిత హరీష్ వ్యక్తిత్వానికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు.
ALSO READ: Deepika Padukone: హమ్మయ్య ఎట్టకేలకు స్పందించిన దీపిక.. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి?