Gismat Mandi Gowthami Chowdary: సోషల్ మీడియా ఇన్ప్లూయేన్సర్, జిస్మత్ మండి ఓనర్ గౌతమి చౌదరి వివాదం గురించి తెలిసిందే. కట్నం కోసం తన భర్త వేస్తున్నాడంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. గత నెల రోజులకు పైగా గౌతమి తన భర్త ధర్మ మహేష్, అతడి ఫ్యామిలీతో పోరాటం చేస్తుంది. తన భర్తకు ఎఫైర్స్ ఉన్నాయని, బిగ్ బాస్ ఫేం రీతూ చౌదరి అర్థరాత్రిళ్లు తన ఇంటికి వచ్చిందని ఆరోపణలు కూడా చేశారు. రీతూ చౌదరి తను లేనప్పుడు తన భర్తతో కలిసి ప్లాట్కి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ లను కూడా విడుదల చేశారు. దీంతో ఈ వ్యవహరం మరింత ముదురింది.
రోజు రోజుకు ఈ కేసు కొత్త మలుపుతు తిరుగుతుంది. ఈ క్రమంలో గౌతమి భర్త ధర్మ మహేష్ తండ్రి కకాణి బాబు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ, ఇంత జరుగుతుంటే.. ఇప్పటి వరకు ధర్మ మహేష్ బయటకు రాకపోవవడం గమనార్హం. ఈ క్రమంలో గౌతమి తాజాగా ప్రముఖ మీడియా ఛానల్కు ఇంటర్య్వూలో ఇచ్చింది. యాంకర్ మూర్తితో డిబెట్లో పాల్గొన్న ఆమె సంచలన విషయాలు బయటపెట్టారు. తన భర్త అంబర్పేట్ శంకరన్న పేరు చెప్పి బెదిరిస్తున్నారని బయటపెట్టింది.
వరకట్నం వేధింపులతో పాటు తన భర్త చంపేస్తానంటూ రౌడీలతో బెదిరిస్తున్నాడని గౌతమి ఆరోపించింది. ధర్మ మహేష్ అంబర్పేట్ శంకరన్న పేరు చెప్పి తనని బెదిరిస్తున్నట్టు లైవ్లో రివీల్ చేసింది. ఒక సినిమా నిర్మాత గౌతమికి కాల్ చేసి.. అర్జెంట్ గా అంబర్ పేట్ శంకరన్న దగ్గరికి రండి.. ఆయన ఈ సమస్యను సెటిల్ చేస్తాడంటూ గౌతమిని ఫోన్ కాల్లో బెదిరించినట్టు చెప్పారు. అంతేకాదు తన భర్త ధర్మ మహేష్ కూడా తన వెనుక అంబర్ పేట్ శంకర్ అన్న ఉన్నాడని, నువ్వేం చేయలేవంటూ బెదరించినట్టు ఆమె లైవ్లో బయటపెట్టింది.
గౌతమి వ్యాఖ్యలతో యాంకర్ మూర్తి.. లైవ్లోనే అంబర్పేట్ శంకర్‌కు ఫోన్ చేయగా.. ఆయన ఇలా స్పందించారు. ధర్మ మహేష్ ఎవరో తెలియదని ఆయన స్పష్టం చేశారు. “డ్రింకర్ సాయి సినిమాలో అతడితో కలిసి నటించాను. కానీ, తనతో ప్రత్యేకమైన పరిచయం ఏం లేదు. వారు నా పేరును తప్పుగా వాడుతున్నారు. నేను వీరిద్దరి వ్యవహరంలో కలుగజేసుకోలేదు. నాకసలు ధర్మ మహేష్, గౌతమి చౌదరిలు ఎవరో కూడా తెలియదు. నేను రౌడీయిజం వదిలేసి చాలా కాలం అవుతుంది. నాకు పెళ్లై, పిల్లలు ఉన్నారు. అలాంటి నేను ఒక ఆడపిల్లకు అన్యాయం చేస్తానా. నా సపోర్టు ఎప్పుడు ఈ అమ్మాయికి. ఈమెకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. నేను హెల్ఫ్ చేస్తాను. కానీ, భార్య భర్తల గొడవలను నేను సెటిల్ చేస్తానని అన్న మాటల్లో నిజం లేదు” అని ఆయన పేర్కొన్నారు.