E-Paper
Advertisement

CM Revanth Reddy: కేరళం సీఎం ఆరోపణలు.. తిప్పికొట్టిన సీఎం రేవంత్‌రెడ్డి, ఆరు పేజీల లేఖలో

CM Revanth Reddy: కేరళం సీఎం ఆరోపణలు.. తిప్పికొట్టిన సీఎం రేవంత్‌రెడ్డి, ఆరు పేజీల లేఖలో
Advertisement

CM Revanth Reddy: కేరళంలో అసెంబ్లీ ఎన్నికలు తారాస్థాయికి చేరాయి. మూడోసారి జెండా ఎగురవేసి హ్యాట్రిక్ కొట్టాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కీలక నేతలపై అస్త్రాలను సంధించారు. లేటెస్ట్‌గా కేరళం సీఎం విజయన్ చేసిన ఆరోపణలపై తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏకంగా ఆరు పేజీల లేఖను ఆయనకు సంధించారు.

కేరళం సీఎం విజయన్ ఆరోపణలు.. తిప్పికొట్టిన సీఎం రేవంత్‌రెడ్డి

Advertisement

సుస్థిరాభివృద్ధిలో తెలంగాణ ఆరో స్థానంలో ఉందంటూ కేరళ సీఎం విజయన్ చేసిన కామెంట్స్‌పై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆయన చేసిన విమర్శలపై ఎక్స్ వేదికగా కౌంటరిచ్చారు. అదొక అసంబద్ధ పోలిక అని పేర్కొన్నారు. వాస్తవ గణాంకాలతో కూడిన ఆరు పేజీల లేఖను పోస్టు చేశారు. విజయన్ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ చురకలు అంటించారు సీఎం రేవంత్.

తెలంగాణ ప్రభుత్వంపై సీఎం విజయన్ చేసిన ఆరోపణలకు ఉపయోగించిన గణాంకాలు 2023-24కి సంబంధించినవి. ఆ సమయంలో బీఆర్ఎస్ పాలన చివరి దశలోనివని గుర్తుచేశారు. కేరళలో విజయన్ ప్రభుత్వం దాదాపు 120 నెలలుగా అధికారంలో ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 28 నెలలు మాత్రమే అయ్యిందన్నారు.

Advertisement

చేసిన ఆరోపణలపై ఆరు పేజీల లేఖలో తెలంగాణ సీఎం సమాధానాలు 

70 ఏళ్ల కేరళ ప్రస్థానాన్ని 28 నెలల పాలనతో పోల్చడం విజయన్ లాంటి సీనియర్ నేత తగదన్నారు. కేరళ పేదరికాన్ని నిర్మూలిస్తుందన్న విజయన్ వాదనపై రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఆ లక్ష్యం నెరవేరిందా? అంటూ ప్రశ్నించారు. ఇలాంటి వాగ్దానాలు నిరంతర ప్రక్రియగా మిలిగిపోతాయని అందులో పేర్కొన్నారు.

60 ఏళ్లుగా అన్ని ప్రభుత్వాల కృషి వల్ల గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న విదేశీ మారకద్రవ్యం వల్ల అక్కడ పేదరికం తగ్గిందన్నారు. ఆ ఘనత ఎల్డీఎఫ్ ప్రభుత్వానిది కాదన్నారు. తెలంగాణ ఏర్పడి కేవలం పుష్కర కాలం మాత్రమే అయ్యిందన్నారు. దశాబ్దంపాటు బీఆర్ఎస్ పాలన చేసిందన్నారు. కేంద్రంలో బీజేపీ సృష్టించిన ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రంలో పేదరికం 5.88 శాతంగా నమోదైందన్నారు.

ALSO READ: జామకాయ దొంగలించిందన్న పాపానికి.. ఒక చిన్నారిని కట్టేసి హింసించిన దుర్మార్గుడు

శిశు మరణాలపై వస్తున్న వాదనలను ఆయన సవాలు చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద తెలంగాణలో ఆరోగ్య సంరక్షణ పరిధిని విస్తరిణ, సంస్థాగత ప్రసవాలలో వచ్చిన మెరుగుదలను ప్రముఖంగా ప్రస్తావించారు.కేరళ డిజిటల్ భూ రికార్డుల వ్యవస్థను ప్రస్తావిస్తూ ఉత్తమ పద్ధతుల నుండి నేర్చుకోవడానికి తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్.

ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం తన రాజకీయ వైఖరిలో కపటత్వాన్ని ప్రదర్శిస్తోందన్నారు. అదే సమయంలో కేరళ బంగారు స్మగ్లింగ్ కేసును ప్రస్తావించారు. దర్యాప్తులో పురోగతి లేకపోవడాన్ని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో ఉద్యోగులకు, లబ్ధిదారులకు ఎలాంటి మినహాయింపు లేకుండా సకాలంలో చెల్లింపులు జరిగేలా చూశామన్నారు. కేరళ ప్రజలు తనకు నేర్పిన మాటను ఇప్పుడు ఆప్యాయతతో చెబుతున్నాను.. నీ పో, మోనే విజయన్‌!( తెలుగులో వెళ్లు అబ్బాయ్ విజయన్)” అంటూ తన లేఖను ముగించారు సీఎం రేవంత్ రెడ్డి.

 

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×