E-Paper
Advertisement

Air India: మహిళపై మూత్ర విసర్జన.. ఎయిరిండియాకు 30 లక్షల జరిమానా

Air India: మహిళపై మూత్ర విసర్జన.. ఎయిరిండియాకు 30 లక్షల జరిమానా
Advertisement

Air India: ఓ ఉన్నత ఉద్యోగి.. విమానంలో ఫుల్ గా తాగి బుద్ధి మరిచాడు. ఏమాత్రం ఇంగితం లేకుండా ప్రవర్తించాడు. సీట్లో కూర్చొని ఉన్న వృద్ధ మహిళపై మూత్రం పోశాడు. విషయం తెలిసిన విమాన సిబ్బంది స్పందించాల్సిన విధంగా స్పందించలేదు. ఆ మహిళకు వేరే దుస్తులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ తాగుబోతు ప్యాసింజర్ ను వదిలేశారు. కట్ చేస్తే.. నెల తర్వాత విషయం వెలుగు చూసింది. బాధిత వృద్ధురాలు ఎయిర్ ఇండియా ఛైర్మైన్ కు లేఖ రాయడం.. అది కాస్తా DGCA దృష్టికి వెళ్లడం.. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడం.. నిందితుడి అరెస్ట్.. వరుసగా జరిగిపోయాయి. విషయం తెలిసి నిందితుడు శంకర్ మిశ్రాను ఉద్యోగంలోంచి తీసేసింది కంపెనీ. లేటెస్ట్ గా, ఈ కేసులో మరోమారు యాక్షన్ మొదలైంది.

ఘటనకు బాధ్యుల్ని చేస్తూ ఎయిర్ ఇండియాపై.. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) చర్యలు తీసుకుంది. 30 లక్షల జరిమానా విధించింది. విమాన పైలట్‌ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. విమానాల్లో సేవలను పర్యవేక్షించే డైరెక్టర్‌కు 3 లక్షల పెనాల్టీ కట్టాలని ఆదేశించింది.

Advertisement

ఘటనలో ఎయిరిండియా సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో.. ఆ సమయంలో విమానంలో ఉన్న కెప్టెన్‌, క్యాబిన్‌ సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు ఇప్పటికే చేపట్టింది ఎయిరిండియా. నిందితుడు శంకర్‌ మిశ్రా.. నాలుగు నెలల పాటు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించింది. తాజాగా, ఎయిరిండియాపైనే DGCA చర్యలు తీసుకోవడం మరింత ఆసక్తికరం.

Tags

Related News

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

Big Stories

Advertisement
×