BigTV English
Advertisement

Haryana BJP Gets Poll Body Notice : బీజేపీకి షాక్ ఇచ్చిన హర్యానా ఎన్నికల సంఘం..

Haryana BJP Gets Poll Body Notice : బీజేపీకి షాక్ ఇచ్చిన హర్యానా ఎన్నికల సంఘం..

Haryana BJP Gets Poll Body Notice For Featuring Child In Campaign Video: ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనితో ఇప్పటికే అక్కడ రాజకీయ వేడి రాజుకుంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. ఢిల్లీకి పొరుగునే ఉన్న హర్యానా రాష్ట్రంలో జరిగే ఎన్నికల కోసం ఢిల్లీ బీజేపీ ఎంపీలు ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. అక్కడ వాల్మీకులు, గుర్జర్లు, జాట్ కులస్తుల ఓట్లు ఎక్కువ. అందుకే వారిని బీజేపీ వైపు తిప్పుకునేలా బీజేపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. అయితే హర్యానా ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ తన ప్రచార వ్యూహాలకు పదును పెట్టింది. అన్ని పార్టీలకన్నా ముందుగానే ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే హర్యానాలో బీజేపీకి అక్కడి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. అక్కడి బీజేపీ నేతలకు షోకాజ్ నోటీసు పంపింది.


మైనర్ బాలుడితో ప్రచారమా?

బీజేపీ లాంటి జాతీయ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మైనర్ బాలుడిని ఉపయోగించుకోవడం హర్యానా ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. హర్యానా బీజేపీ తీరును తప్పుపడుతూ అక్కడి నేతలకు బుధవారం షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో చిన్నారులను ఉపయోగించుకోవడం తప్పని తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నేటి సాయంత్రం ఆరు గంలలలోగా వివరణ ఇవ్వాలని ఎన్నికల నిర్వహణ అధికారి హర్యానా బీజేపీ నేతలను ఆదేశించారు.


హట్ టాపిక్
హర్యానా రాజకీయాలలో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారిపోయింది. అయినా ఇంకెవరూ దొరకనట్లు చిన్నారులను ఎన్నికల ప్రచారంలో చీఫ్ గా ఉపయోగించుకోవడమేమిటని ప్రతిపక్షాలు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఈ విషయంలో ఢిల్లీ బీజేపీ అగ్రనాయకత్వం కూడా హర్యానా బీజేపీ నేతలపై సీరియస్ గా ఉంది. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఇలాంటి పనుల వలన పార్టీ ప్రతిష్టకు అప్రదిష్ట తెచ్చినవారవుతారని హర్యానా నేతలపై బీజేపీ అధిష్టానం సీరియస్ గా ఉంది.

https://twitter.com/BJP4Haryana/status/1828379342080229768

Related News

Bihar Elections: చెరువులో ఈత కొడుతూ.. చేపలు పడుతూ.. రాహుల్ గాంధీ ప్రచారం!

Perplexity: చాలా మందికి తెలియని రాజకీయ నాయకుల “గుట్టును” బయటపెట్టబోతున్న పెర్‌ప్లెక్సిటీ AI

Student Jumps from 4th floor: స్కూల్‌‌లో 4వ అంతస్తు నుంచి దూకి 6వ తరగతి విద్యార్థిని మృతి…

Argument In Bengaluru: బెంగళూరులో వాగ్వాదం తర్వాత ఉద్దేశపూర్వకంగా బైక్‌ను ఢీకొట్టిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్

Bihar Politics: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ప్రశాంత్ కిశోర్ పార్టీ నేత హత్య, నితీష్ పార్టీ అభ్యర్థి అరెస్టు

Sabarimala Gold Theft: శబరిమల బంగారం వివాదంలో ట్విస్ట్.. 2019 లోనే రాగిగా మార్చేసి!! ఎంత చోరీ అయ్యిందంటే

PM Modi: ఛత్తీస్‌గఢ్ పర్యటనకు ప్రధాన మోదీ.. రూ.14,000 కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపన

Saudi Crime: ఎన్‌కౌంటర్లో చిక్కుకున్నాడు.. చనిపోయే ముందు భార్యకు వాయిస్ నోట్ పంపాడు!

Big Stories

×