AP Free Bus Scheme: ఆగష్టు 15 నుంచి ఉచిత బస్సు పథకాన్ని చంద్రబాబు సర్కార్ మొదలుపెట్టనుంది. ఏపీకి చెందిన 74 శాతం బస్సుల్లో ఈ పథకం వర్తిస్తుంది. మిగతా బస్సుల్లో అయితే కచ్చితంగా డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవాల్సిందే. ప్రస్తుతం రవాణా సంస్థలో 11,449 బస్సులు ఉన్నాయి. వాటిలో ఉచిత ప్రయాణం అమలు కేవలం ఐదు రకాల బస్సుల కు మాత్రమే ఉంటుంది.
ఉచితంగా ప్రయాణం చేసే బస్సులు 8,458 మాత్రమే ఉన్నాయి. మిగతా బస్సులు ఎక్కతే కచ్చితంగా డబ్బులు ఇచ్చి టికెట్ తీయాల్సిందే. ఉచిత బస్సు పథకం అమలైతే రద్దీ పెరుగుతుందని భావిస్తోంది ప్రభుత్వం . రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు ఆర్టీసీ అధికారులు.
ఉచిత బస్సు పథకాన్ని ఆగష్టు 15 నుంచి ఏపీలో అమల్లోకి రానుంది. మంగళగిరి నుంచి ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఉదయం స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత ఈ పథకాన్ని ప్రారంభిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఉదయం ప్రారంభిస్తారా? ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది అనేది స్పష్టత రావాల్సివుంది.
ఆ బస్పులు, ఆ ప్రాంతాలకు ఉచిత బస్సు సదుపాయం ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కొన్ని ఇంటర్‌స్టేట్ సర్వీసులు ఉన్నాయి. ఏపీ నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలకు తిరుగుతున్నాయి. వాటిలో ఉచిత ప్రయాణం సదుపాయం ఉండదు. ఆ విషయాన్ని మహిళలు కచ్చితంగా తెలుసుకోవాలి.
ALSO READ: మళ్లీ జన్మంటూ ఉంటే అక్కడ పుట్టాలని ఉందన్న సీఎం చంద్రబాబు
ఏ మాత్రం మరిచిపోయినా డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవాల్సిందే. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు, నంద్యాల జిల్లాలో శ్రీశైలం ఘాట్లలో తిరిగే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయకూడదని ప్రభుత్వం భావన.
వాటిలో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇస్తే ఆ బస్సుల్లో రద్దీ ఎక్కువవుతోందని ఆలోచన చేస్తోంది. ఘాట్‌లో ఉచిత బస్సులు నడపటం కష్టమవుతుందని, ప్రభుత్వంపై భారం పెరుగుతుందని అంచనా వేస్తోంది. నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా మహిళలు ప్రయాణించే అవకాశం ఉండదు.
ఉచిత బస్సు సదుపాయం నేపథ్యంలో రద్దీ పెరిగే అవకాశముంది. ఇప్పటికే చాలా ఆర్టీసీ డిపోల్లో డ్రైవర్ల కొరత ఉంది. ఈ నేపథ్యంలో ఏ రోజుకు ఆ రోజు తాత్కాలిక డ్రైవర్లు సంఖ్యను పెంచనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయా జిల్లాల రవాణాశాఖ అధికారులు తాత్కాలిక డ్రైవర్లను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు కండక్టర్ల కొరత బాగానే ఉంది.
ఆ సమస్య అధిగమించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. కొత్త ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేవరకు డ్రైవర్లు-కండక్టర్లు కొరత తప్పదని అంచనా వేస్తోంది. నాన్‌స్టాప్ బస్సులకు టికెట్లు జారీ చేసే బుకింగ్ కేంద్రాల్లో కండక్టర్లు ఉంటున్నారు. వారికి మళ్లీ బస్సుల్లో డ్యూటీలు వేయనున్నట్లు సమాచారం. కొత్త బస్సులు వచ్చేవరకు డ్యూటీలు చేయాలని డిపో మేనేజర్లు ఆయా కండక్టర్లను కోరుతున్నారు.
మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో పురుషులు ప్రయాణించే అవకాశం తగ్గవచ్చని అధికారుల భావిస్తున్నారు. రద్దీగా ఉండే బస్సులో నిలబడి ప్రయాణించే బదులు ప్రైవేటు వాహనాల వైపు మొగ్గుచూపుతారన్నది ఓ అంచనా. ప్రస్తుత 60 శాతం పురుషులు, 40 శాతం మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు.
ఉచిత బస్సు పథకం అమలైతే పురుషుల సంఖ్య తగ్గి, మహిళల సంఖ్య 70శాతానికి పెరుగుతుందని అంచనాలు వేసుకుంటున్నారు. పురుషుల ప్రయాణాలు తగ్గడంతో ఆర్టీసీకి ఏడాదికి దాదాపు 300 కోట్ల రూపాయల వరకు రాబడి తగ్గుతుందని అంటున్నారు.