Hyderabad Rains: రెండు నెలలుగా ఒక్క చినుకు పడని హైదరాబాద్ నగరంలో గడిచిన నాలుగైదు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరం తడిచి ముద్దవుతోంది. భాగ్యనగరంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి వివిధ ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గడిచిన నాలుగైదు రోజుల నుంచి తెలంగాణలో సాయంత్రం అయితే చాలు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కుమ్మేస్తోంది. ముఖ్యంగా ఎల్బీనగర్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, ముషీరాబాద్, సైదాబాద్, అంబర్‌పేట వంటి ప్రాంతాల్లో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి.
లక్డీకాపూల్ కంట్రోల్ రూమ్, నాంపల్లి, మొజంజాహీ మార్కెట్ వరకు రోడ్లకు ఇరువైపులా వరద నీరు పోటెత్తింది. కేసీపీ కూడలి, పంజాగుట్ట, మైత్రీవనం, అమీర్‌పేట, ఎర్రగడ్డ రద్దీ రహదారులపై మోకాళ్ల లోతు వరకు వరద చేరింది. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పెద్ద అంబర్‌పేట్ నుంచి ఎల్బీనగర్ మీదుగా సిటీలోకి వచ్చే ప్రధాన రహదారిలో కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో వర్షం ప్రభావం తీవ్రంగా చూపింది. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.
ALSO READ: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క, ఏం జరిగింది?
ఓవైపు ట్రాఫిక్ పోలీసులు, మరోవైపు జీహెచ్ఎంసీ, ఇంకోవైపు హైడ్రా అధికారులు వరద నీటిని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. అర్థరాత్రి వరకు ఆ పనుల్లో నిమగ్నయ్యారు. నాదర్‌గుల్‌లో 80 మిల్లీమీటర్లు, హయత్‌నగర్‌లో 75 మిల్లీ మీటర్లు చొప్పున వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు.
ఇదిలాఉండగా దక్షిణ కోస్తాంధ్ర తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ఫలితంగా ఆది, సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్ మొదలు హైదరాబాద్ మీదుగా ఖమ్మం వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. చాలా జిల్లాలకు పసుపు హెచ్చరికలు జారీ చేసింది ఆ శాఖ.
#HYDTPinfo #RainAlert
Amid heavy downpour & waterlogging, Sri D. Joel Davis, IPS, Jt.CP Traffic, Hyderabad, is on ground at Mythri Vanam, closely monitoring traffic flow. 🚦🌧️ #HyderabadRains #MonsoonSeason2025 #MonsoonSeason #TrafficUpdate pic.twitter.com/G5GqDCvpF7— Hyderabad Traffic Police (@HYDTP) August 9, 2025
#HYDTPinfo#RainAlert
Due to #HeavyRainfall, Water logged at Panjagutta flyover. @shotr_pgt staff on spot and regulating the traffic.#HyderabadRains #MonsoonSeason2025 pic.twitter.com/iAvIrcVdRO— Hyderabad Traffic Police (@HYDTP) August 9, 2025