BigTV English

Filmfare Awards 2025: ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ సౌత్ విన్నర్స్ ఫుల్ లిస్ట్ ఇదే..!

Filmfare Awards 2025: ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ సౌత్ విన్నర్స్ ఫుల్ లిస్ట్ ఇదే..!

Filmfare Awards 2025: సౌత్ ఫిలిం ఇండ‌స్ట్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ లో మన స్టార్స్ కు ఎంతో మందికి అవార్డులు దక్కాయి. ఈ ఏడాది అవార్డులు అందుకోబోతున్న విన్నర్స్ లిస్ట్ వచ్చేసింది. 70 వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2025’ వేడుక శనివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. గెలుపు గుర్రాలకు పురస్కారాలను అందించారు. ఆ లిస్ట్ లో అందరు స్టార్ హీరోలే ఉండటం విశేషం. నిన్న హైదరాబాద్‌లో అవార్డు జరిగింది. ఈ గ్రాండ్ ఈవెంట్‌కి సౌత్ సినిమాకి చెందిన కొందరు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరైన తారలు తమ క్లాసీ దుస్తుల్లో గ్లామ్ కోటియన్‌గా మారారు. జెర్సీ స్టార్ నాని, మాళవికా మోహనన్, అదితి రావ్ హైదరీ, టెస్ట్‌ల సిద్ధార్థ్, గూడాచారి అడివి శేష్, ప్రగ్యా జైస్వాల్, కింగ్‌డమ్‌కు చెందిన భాగ్యశ్రీ బోర్స్ వంటి ప్రముఖులు రెడ్ కార్పెట్‌పై నడిచి తమ ప్రత్యేకమైన ఫ్యాషన్ శైలిని ప్రదర్శించారు.. ఈ వేడుకకు సంబందించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..


 

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2025..


ప్రతి ఏడాది సౌత్ ఇండస్ట్రీ ఎంతో ఘనంగా జరుపుకొనే అవార్డ్స్ వేడుకలో ఈ అవార్డ్స్ ఒకటి. ఈ వేడుకలో సీనియర్స్ నుంచి కొత్త స్టార్స్ అందరు ఇలా ఈ వేడుకలో మెరిశారు. చిన్మయి శ్రీపాద తన పాటతో అందరిని ఆకట్టుకుంది. అడివి శేష్ టైలర్డ్ డబుల్ బ్రెస్ట్ బ్లాక్ సూట్‌లో అద్భుతంగా కనిపించాడు.. ఇండస్ట్రీలోని సీనియర్స్ అందరు తమ అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మాళవిక మోహనన్ స్పీచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రెడ్ కార్ఫెట్ పై సినీ తారలు ఎంతో అందంగా ముస్తాబయి ప్రేక్షకులకు మనసు దోచుకున్నారు.

Also Read : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ సౌత్ విన్నర్స్ వీరే.. 

ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ 2025 వేడుక నిన్న అట్టహాసంగా జరిగింది. ఎప్పటిలాగే ఈ ఏడాదికి గాను గ్లామర్ & స్టైల్ క్యాటగిరిలో తెలుగు స్టార్స్ ఎక్కువగా విజేతలుగా నిలిచారు. ఆ లిస్ట్ లో ఎవరెవ్వరు ఉన్నారంటే.. స్టైల్ ఐకాన్ డౌన్ ది ఇయర్స్ అవార్డు చిరంజీవికి దక్కింది. అలాగే స్టైలిష్ & ఐకాన్ అవార్డు అల్లు అర్జున్ ను వరించింది. స్టార్ ఆఫ్ ఆల్ సీజన్స్ వెంకటేష్, మ్యాన్ ఆఫ్ స్టైల్ అండ్ సబ్ స్టాన్స్ నాని, గ్లామరస్ యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, అదే విధంగా హాట్ స్టేప్పర్ ఆఫ్ ది ఇయర్ హీరో అడవి శేషు, మాళవిక మోహనన్, స్టైలిష్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఇక స్టైలిష్ మూవీ మొఘల్ నాగవంశీకి ఈ అవార్డులు దక్కాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మంది అవార్డులను సొంతం చేసుకున్నారు. వీరితో పాటుగా పలువురు స్టార్స్ కు అవార్డులు దక్కాయి. ప్రస్తుతం ఈ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×