Pulivendula Politics: ప్రజల ఆయుధం ఓటు.. నేతల తలరాతలు రాసేది ఓటర్లు. మూడు దశాబ్దాలుగా పులివెందుల పరిస్థితి వేరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్ల వేలికి సిరా అంటేది కాదు. బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకునేవారు వైసీపీ నేతలు. 30 ఏళ్ల కాలంలో అక్కడ జడ్పీటీసీ స్థానానికి రెండోసారి ఎన్నిక జరుగుతోంది. అక్కడ పరిస్థితి ఏ రేంజ్‌లో ఉండేది అర్థం చేసుకోవచ్చు.
జగన్ ఫ్యామిలీకి కంచుకోట పులివెందుల. అక్కడ ఏ ఎన్నికలు జరిగినా అంతా ఏకగ్రీవం చేసుకునేవారు. ప్రస్తుతం జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఆ పార్టీ నేతలు. పరువు నిలుపుకునేందుకు ఓటుకు పది వేలు పెట్టేందుకు వెనుకాడడం లేదని తెలుస్తోంది.
పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి.. వైసీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఎలాగైనా పులివెందుల జెడ్సీటీసీ ఉప ఎన్నికలో విజయం సాధించాలని ఇరుపార్టీలు తీవ్రప్రయత్నాలు చేస్తున్నాయి. రవి ఎత్తులకు వైసీపీ నేతలు చిత్తవుతున్నారు. చివరకు దాడులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ఈ సీటును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఎందుకంటే గడిచిన మూడు దశాబ్దాల్లో కేవలం ఒక్కసారి మాత్రమే అంటే 2001లో ఎన్నిక జరిగింది. అప్పటి టీడీపీ హయాంలో మాత్రమే. దాని తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నిక జరుగుతోంది. ఎప్పుడూ లేని విధంగా ప్రధాన పార్టీలు, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ALSO READ: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?
భారీగా హామీలు గుప్పించారు. సంక్షేమం, అభివృద్ధి చేస్తామంటూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలో ఓటర్లు తమతమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు మంచి రోజులు వచ్చాయని ఆనంద పడుతున్నారు. 1995, 2006, 2013, 2021 ఎన్నికల్లో ఏకగ్రీవంగా వైసీపీ ఎంపిక చేసుకునేది. ఇప్పుడు వైసీపీ కోటను బద్దలు కొట్టాలనే ఆలోచనలో టీడీపీ ఉంది.
తాజాగా జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం ఆదివారం సాయంత్రంతో తెర పడనుంది. మంగళవారం పోలింగ్‌కు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పులివెందుల 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 10,601 మంది ఓటర్లు ఉన్నారు. అంటే సగటున ఒక్కో కేంద్రానికి 700 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఒంటిమిట్ట జెడ్పీ సీటుకు 30 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అక్కడ 24 వేల మందికి పైగానే ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ కు సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీలో ఓటమి భయం వెంటాడుతోంది. ఈ ఉప ఎన్నిక మాజీ సీఎం జగన్‌కు పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో డబ్బును మంచి నీళ్ల మాదిరిగా ఖర్చు చేయడానికి సిద్ధమైంది.
ఓటు కోసం ఎంత డబ్బు ఇచ్చేందుకు వెనుకాడడం లేదు ఆ పార్టీ నేతలు. అందుకోసం బెంగళూరు కేంద్రంగా జగన్ వ్యూహం చేస్తున్నారు. ఒక్కో ఓటుకు ఏకంగా 10 వేల రూపాయలు పైనే ఇవ్వడానికి సిద్దమైనట్లు గ్రౌండ్ రిపోర్టు ద్వారా తెలుస్తోంది. ఈ రెండు సిట్టింగ్ స్థానాలు వైసీపీవే.
కనీసం రెండు కాకపోయినా పులివెందులలో కచ్చితంగా గెలిచి తీరాలని భావిస్తున్నారు. అయితే వివేకానంద హత్య కేసు వైసీపీ నేతలను భయపడుతోంది. రెండురోజుల కిందట సునీత పులివెందుల వచ్చి, అక్కడి వైసీపీ నేతలను టార్గెట్ చేశారు. హత్యా రాజకీయాలు మారాలన్నారు.
పులివెందులలో సాక్షి మీడియాను అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. సాక్షి రిపోర్టర్లు పులివెందులకు చేరుకొని, వాళ్లకు వాళ్లే దాడి చేసుకొని తమపై నింద వేయడానికి ప్రయత్నిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా వైసీపీ నేతలు నామినేషన్ వేశారు.
– పులివెందుల టీడీపీ ఇన్చార్జ్… pic.twitter.com/25HUUrl0A6
— Swathi Reddy (@Swathireddytdp) August 9, 2025