BigTV English
Advertisement

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి …  రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ …  గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie  : ఫాంటసీ సినిమాలు మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళతాయి. అద్భుతమైన ఫాంటసీ విజువల్స్‌తో ఈ సినిమాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా సీరియల్ కిల్లర్ ను పట్టుకునే క్రమంలో జరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


స్టోరీలోకి వెళితే

1973లో సుజీ సాల్మన్ అనే 14 ఏళ్ల అమ్మాయి పెన్సిల్వేనియాలోని ఒక చిన్న ఊళ్లో తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటుంది. సుజీ ఒక సాధారణ టీనేజర్. ఫోటోగ్రఫీ ఇష్టపడుతూ, తన స్కూల్ క్రష్ రే సింగ్ పై డ్రీమింగ్‌లో ఉంటూ, “జీవితం సూపర్ కూల్!” అన్నట్లు జోష్‌గా ఉంటుంది. కానీ ఒక రోజు ఆమెను తన పొరుగింటివాడయిన జార్జ్ హార్వీ అనే ఒక సీరియల్ కిల్లర్ చేతుల్లో హత్యకు గురవుతుంది. కానీ ఆమె ఆత్మ ఒక అతీంద్రియ “ఇన్-బిట్వీన్” ప్రపంచంలోకి (స్వర్గం మరియు భూమి మధ్య ఒక ఫాంటసీ రాజ్యంలోకి) వెళుతుంది. అక్కడ నుండి ఆమె తన కుటుంబాన్ని, హంతకుడిని గమనిస్తుంది. సుజీ ఆత్మ, ఈ ఫాంటసీ ప్రపంచంలో, హోలీ అనే మరో హత్యకు గురైన అమ్మాయితో స్నేహం చేస్తుంది. ఆమె సుజీకి, “ఇక్కడ నీవు నీ కుటుంబాన్ని చూడొచ్చు, కానీ జోక్యం చేసుకోలేవు!” అని సరదాగా చెబుతుంది.


Read Also : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

భూమిపై సుజీ తండ్రి జాక్, తల్లి అబిగైల్, సోదరి లిండ్సే, సోదరుడు బక్లీ, బామ్మ లిన్ ఆమె మరణంతో విషాదంలో మునిగిపోతారు. జాక్ తన కూతురి మరణానికి హార్వీని అనుమానించి, అతని గురించి ఆధారాలు వెతుకుతాడు. అబిగైల్ ఈ బాధను తట్టుకోలేక, కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతుంది. అయితే లిన్, కొంచెం తాగుబోతు కానీ సరదా బామ్మ, కుటుంబాన్ని కాపాడటానికి వస్తుంది. సుజీ సోదరి లిండ్సే, హార్వీ ఇంట్లోకి చొరబడి, అతను సీరియల్ కిల్లర్ అని రుజువు చేసే డైరీని కనిపెడుతుంది. కథలో ఒక కీలకమైన ట్విస్ట్ వస్తుంది. సుజీ ఆత్మ, హార్వీని శిక్షించడానికి భూమిపైకి రావడానికి ప్రయత్నిస్తుంది. అయితే అందుకు కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఈ క్రమంలో సుజీ ఆత్మ భూమిపైకి వస్తుందా ? తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుందా ? ఆ కిల్లర్ అమ్మాయిలను ఎందుకు చంపుతున్నాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

ఏ ఓటీటీలో ఉందంటే

ఈ ఫాంటసీ మిస్టరీ మూవీ పేరు ‘The Lovely Bones’. పీటర్ జాక్సన్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2009 డిసెంబర్ 11న థియేటర్‌లలో విడుదలైంది. ప్రస్తుతం Netflix, Amazon Prime, Hulu, Apple TV లలో స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల 15 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి Imdbలో 6.6 /10 రేటింగ్ ఉంది.ఇందులో సాయోర్సే రోనన్ (సుజీ సాల్మన్), మార్క్ వాల్‌బెర్గ్ (జాక్ సాల్మన్), రాచెల్ వైస్ (అబిగైల్ సాల్మన్), సుసాన్ సరండన్ (గ్రాండ్‌మా లిన్), స్టాన్లీ టుస్సీ (జార్జ్ హార్వీ) ప్రధాన పాత్రల్లో నటించారు.

Related News

The Great Pre Wedding Show OTT : చిన్న సినిమాగా వచ్చి చితగ్గొడుతున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’… క్రేజీ ఓటీటీ డీల్

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల ఆంటీ… పాటలతో వలపు వల… ఆ సీన్లైతే అరాచకం భయ్యా

OTT Movies : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. ఆ నాల్గింటిని మిస్ అవ్వకండి..

OTT Movie : పూలమ్మే పిల్ల జీవితంలోకి మాజీ ప్రియుడు… ఖతర్నాక్ క్లైమాక్స్ మావా

OTT Movie : కుర్రాడి నుంచి పండు ముసలిదాకా ఎవ్వర్నీ వదలని అమ్మాయి… ఇదెక్కడి తేడా యవ్వారంరా సామీ ?

OTT Movie : ప్రియుడిని వదిలేసి మరొకడితో… కళ్ళు తెరిచినా మూసినా అవే సీన్లు… క్లైమాక్స్ కెవ్వు కేక

OTT Movie : చేతబడులతో చచ్చి బతికే కుటుంబం… ‘విరూపాక్ష’ను మించిన బ్లాక్ మ్యాజిక్ మరాఠీ మూవీ తెలుగులో

OTT Movie : తాత వల్ల నలిగిపోయే కూతురు, మనవడు… గుండెను పిండేసే రాశి ఫ్యామిలీ ఎంటర్టైనర్

Big Stories

×