Mahavatar Narasimha Collections : ఇటీవల కాలంలో జనాలు ఎక్కువగా మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడుతున్నారు. అయితే కొందరు మాత్రం రొటీన్ స్టోరీలు కాకుండా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అలాంటి వారికోసం కొందరు డైరెక్టర్లు పురాణాలలోని కొన్ని కథల ఆధారంగా సినిమాలను తెరకెక్కించి సక్సెస్ ని అందుకుంటున్నారు. స్టార్ డైరెక్టర్లతో ఇలాంటి సినిమాలు రావడంతో ఆ హీరోల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఆ సినిమాలను చూస్తున్నారు. అలాంటిది యానిమేషన్ తో వచ్చిన సినిమాకు స్టార్ హీరో సినిమా కన్నా ఎక్కువ క్రేజ్ రావడం మామూలు విషయం కాదు.. రీసెంట్గా రిలీజ్ అయిన మహావతార్ నరసింహ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకు రోజురోజుకీ కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 150 కోట్లకు పైగా వసూలు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
‘మహావతార్ నరసింహ’ కలెక్షన్స్…
జూలై 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నరసింహ స్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా మైథాలజికల్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కలెక్షన్లు కూడా బాగానే రాబడుతుంది. ఫస్ట్ డే కోటి 70 లక్షల కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టింది.. మొత్తం నాలుగు రోజులకు గాను దాదాపుగా 23 కోట్లు వసూల్ చేసింది. పదిరోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. 15వ రోజు వరకు తెలుగు స్టేట్స్ లో రూ.28 కోట్లు, కన్నడలో రూ.3.50 కోట్లు, హిందీలో రూ.93 కోట్లు, తమిళంలో 1.50 కోట్లు, మలయాళంలో 32 లక్షలు వసూళ్లు చేసింది. ఇండియా నెట్ మొత్తం రూ.127 కోట్లకు చేరుకుందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక ఇండియా గ్రాస్ 150 కోట్లకు చేరుకోగా, ఓవర్సీస్ లో 6 కోట్లు వసూళ్లైంది.. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి 165 కోట్లు వసూల్ అయ్యినట్లు తెలుస్తుంది.. ఈ లెక్కని చూస్తే మరో నాలుగైదు రోజుల్లో ఈ సినిమా 200 కోట్ల క్లబ్లోకి చేరిపోయేలా కనిపిస్తుంది. వీకెండు ఎక్కువ మంది ఏ సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇవాళ ఓపెనింగ్స్ కూడా భారీగా జరిగినట్లు తెలుస్తుంది.
Also Read : ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ సౌత్ విన్నర్స్ ఫుల్ లిస్ట్ ఇదే..!
బుక్ మై షోలో మరో రికార్డ్..
రెండు వారాల కిందట ఏమాత్రం అంచనాల్లేకుండా రిలీజైన ఈ యానిమేషన్ మూవీ.. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఈ రోజు బుక్ మై షోలో గంటకు 35 నుంచి 40 వేల మధ్య టికెట్లు తెగుతున్నాయి అంటే మామూలు విషయం కాదు.. అటు మల్టీప్లెక్సుల్లో ఫుల్స్ పడుతున్నాయి.. సింగిల్ స్క్రీన్స్ కూడా ప్రేక్షకులతో నిండిపోతున్నాయి. ఇలా మూడో వీకెండ్లో ఈ స్థాయిలో జనాలతో థియేటర్లు కళకళలాడిన సినిమా ఈ మధ్య కాలంలో మరొకటి లేదు. మహావతార్ నరసింహ ఇప్పట్లో శాంతించేలా లేదని ఇండస్ట్రీ టాక్. ఆగస్ట్ 14 కూలి, వార్ 2 వచ్చేదాకా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదని అంటున్నారు.. కొత్త సినిమా థియేటర్లలో పడేంత వరకు ఈ సినిమా జోరు ఆగేటట్లు కనిపించలేదు. చివరికి ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి..