Coolie Vs War 2:ఆగస్టు 14వ తేదీన బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరుగుతోందని చెప్పవచ్చు. అటు ఎన్టీఆర్ (NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan) కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 (War 2). ఇటు రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న కూలీ (Coolie ) చిత్రాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా వార్ 2 సినిమా కంటే కూలీ సినిమా పైనే అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర (Upendra), శృతిహాసన్ (Shruti Haasan), అమీర్ ఖాన్ (Aamir Khan) లాంటి భారీ తారాగణం భాగం అవ్వడమే కాకుండా సూపర్ హిట్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి తోడు ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. అటు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సెలబ్రిటీలు మాట్లాడిన మాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి.
ఎన్టీఆర్ టార్గెట్.. రాజకీయ రచ్చ లేపిన నారా లోకేష్ ట్వీట్..
ఇకపోతే వార్ 2 Vs కూలీ అంటూ ఇప్పటివరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వగా.. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) చేసిన పనికి రాజకీయ రచ్చ మొదలైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ను దెబ్బతీయడానికే నారా లోకేష్ ఇలా పోస్ట్ పెట్టాడు అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 14వ తేదీన కూలీ సినిమా విడుదల సందర్భంగా రజినీకాంత్ కి మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే అదే రోజున రిలీజ్ కానున్న ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సినిమా వార్ 2 ను ఆయన పట్టించుకోలేదు. ఈ సినిమాను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే లోకేష్ ఇలా కూలీ సినిమాకు శుభాకాంక్షలు తెలియజేశారు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక దీంతో అటు టీడీపీ మద్దతుదారులకు ఇటు ఎన్టీఆర్ అభిమానులకు మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా నారా లోకేష్ చేసిన ఈ ఒక్క ట్వీట్ ఇప్పుడు రాజకీయ రచ్చ లేపిందనే కామెంట్స్ వ్యక్తం అవుతున్నాయి.
కూలీ సినిమా విశేషాలు..
స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో ఆగస్టు 14వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే ఈ సినిమాకు రూ.375 కోట్లు కేటాయించగా.. ఇప్పటికే డిజిటల్, మ్యూజిక్, సాటిలైట్, ఓవర్సీస్ హక్కుల ద్వారా రూ.250 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి రజనీకాంత్ రూ.150 కోట్లు పారితోషకం తీసుకుంటున్నారు.
వార్ 2 సినిమా విశేషాలు..
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న వార్ 2 చిత్రం కూడా ఆగస్టు 14న విడుదల కాబోతోంది. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. ఆదిత్య చోప్రా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు.
also read:War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.. కానీ ఆంక్షలు తప్పనిసరి!
As @rajinikanth sir completes 50 years in films, we audiences are just lucky to live in the Rajni-era! I will never forget his unwavering support to our family in our darkest hour. Wishing Team #Coolie great success. pic.twitter.com/FCIkgVWfyY
— Lokesh Nara (@naralokesh) August 9, 2025