Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్రెండ్ సెట్ చేస్తున్నారా? పాత సంస్కృతికి ఫుల్‌స్టాప్ పెడుతున్నారా? కొత్త కల్చర్ తీసుకొస్తున్నారా? పాలకులంటే ప్రజలకు సేవలు మాత్రమేనని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
రాజకీయాల్లో ట్రెండ్ మారింది. ఇన్నాళ్ల మాదిరిగా ఏడాదికి ఒకసారి నియోజకవర్గానికి వెళ్తామంటే ఓటర్లు నుంచి నిరసనలు తప్పదు. ఫలితంగా అధికార ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. దీన్ని గమనించిన ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీల నేతలు రూటు మార్చారు. నిత్యం ప్రజలతో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండాలని పదే పదే అగ్రనేతలు చెబుతున్నారు.
ఈ ట్రెండ్‌ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాగానే ఫాలో అవుతున్నారు. ఒకవేళ బిజీ వల్ల నియోజకవర్గానికి వెళ్లకపోయినా నిత్యం అక్కడి ప్రజలతో టచ్‌లో ఉంటున్నారు. సమయం, సందర్భం బట్టి రకరకాల కానుకలను ప్రజలకు అందజేస్తున్నారు.
శనివారం రాఖీ పండగ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో 1500 మంది వితంతు మహిళలకు చీరలు పంపారు. వాటిని నియోజకవర్గంలో నేతలు మహిళలకు అందజేశారు. వాటిని అందుకున్న మహిళలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. రక్షాబంధన్ రోజు ఊహించని కానుక డిప్యూటీ సీఎం నుంచి రావడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు
అన్నట్లు మొన్న అల్లూరు జిల్లా టూర్‌కి వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆ గిరిజన గ్రామానికి తన తోటలో పడిన మామిడిపండ్లను పంపి అక్కడి ప్రజలకు అందజేశారు. దీంతో ఆ గ్రామ ప్రజలు పవన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలిపారు.
ఓ వైపు సినిమాలు, మరోవైపు అధికారులు, ఇంకోవైపు నేతల వరుస సమావేశాలతో నిత్యం బిజీగా ఉంటున్నారు పవన్ కల్యాణ్. దీంతో నియోజకవర్గానికి ఆయన దూరమయ్యారనే వాదన లేకపోలేదు. ఇప్పుడు ఆ గ్యాప్‌ని ఫుల్ చేసుకునే పనిలో పడినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో రాఖీ పండగ నేపథ్యంలో నియోజకవర్గంలో 1500 మందికి చీరలు పంపారని అంటున్నారు.
రేపటి రోజున డిప్యూటీ సీఎం ప్రజలకు ఇవ్వబోయే గిఫ్ట్ ఏంటంటూ చర్చించుకోవడం మొదలైంది. ఒకవిధంగా చెప్పాలంటే ఆ తరహా పద్దతి ఇప్పటివరకు ఏ రాజకీయ నేతలు పాటించిన సందర్భాలు లేవు. కానీ పవన్ అలా కాదని అంటున్నారు. జరుగుతున్న పరిణామాలు గమనించిన రాజకీయ విశ్లేషకులు పవన్ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారని అంటున్నారు. రాబోయే రోజుల్లో పవన్ నుంచి ప్రత్యేక కానుక ఏ ప్రాంతానికి వెళ్తుందో చూడాలి.
పిఠాపురం ఆడపడుచులకు రాఖీ కానుక పంపించిన పిఠాపురం MLA, ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
పిఠాపురానికి చెందిన 1,500 మంది వితంతు మహిళలకు చీరలు పంపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
ఊహించని రక్షాబంధన్ కానుకకి ధన్యవాదాలు తెలిపిన ఆడపడుచులు#RakhiPournami#RakshaBandhan pic.twitter.com/GfgXVshAq4
— JanaSena Party (@JanaSenaParty) August 9, 2025