BigTV English

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : సోషల్ సినిమాలు మన జీవితాల్లోని నిజమైన సంఘటనలను, భావోద్వేగ క్షణాలను, సమాజంలోని పోరాటాలను చూపిస్తాయి. ఇవి మనల్ని నవ్విస్తాయి, ఏడిపిస్తాయి, ఆలోచింపజేస్తాయి. నిజ జీవిత సంఘటనలతో వచ్చిన సినిమాలను ఇష్టపడితే, ఈ సినిమా మీకోసమే. ఈ హిందీ సినిమా, 2020 కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో నాలుగు వేర్వేరు వ్యక్తుల కథలను చూపిస్తుంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో పరిస్థితి ఎలా ఉండేదో దీనిని చుస్తే అర్థం అవుతుంది. ఈ సినిమా ఎక్కడ చూడొచ్చు? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే …


ZEE5లో స్ట్రీమింగ్

ఈ హిందీ సినిమా పేరు ‘India Lockdown’. మధుర్ భండార్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 1 గంట 52 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి 7.1/10 రేటింగ్ ఉంది. ఇది తెలుగు సబ్‌టైటిల్స్‌తో ZEE5లో అందుబాటులో ఉంది. ఇందులో శ్వేతా బసు ప్రసాద్ (మెహ్రునిస్సా), ఆహానా కుమ్రా (మూన్ ఆల్వెస్), ప్రతీక్ బబ్బర్ (మాధవ్), సాయి తామ్హంకర్ (ఫూల్మతి), ప్రకాశ్ బెలవాడి (నాగేశ్వర రావు), జరీన్ షిహాబ్ (పలక్), సాత్విక్ భాటియా (దేవ్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2022 డిసెంబర్ 2న ఈ సినిమా ZEE5లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయింది.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ నాలుగు కథల ద్వారా 2020 మార్చిలో భారతదేశంలో కోవిడ్-19 లాక్‌డౌన్ ప్రభావాన్ని చూపిస్తుంది. అప్పటి ప్రజల జీవితాల్లోని సంఘటనలను హైలైట్ చేస్తుంది.

మొదటి కథ

ఎన్. నాగేశ్వర రావు (ప్రకాశ్ బెలవాడి) ముంబైలో ఒంటరిగా నివసించే రిటైర్డ్ సీనియర్ సిటిజన్. తన గర్భిణీ కూతురు స్వాతి (హృషిత భట్)ని హైదరాబాద్‌లో కలవాలని ప్లాన్ చేస్తాడు. కానీ లాక్‌డౌన్ వల్ల విమానాలు రద్దవడంతో, అతను తన అపార్ట్‌మెంట్‌లో తన కుక్క బ్రూనోతో ఒంటరిగా చిక్కుకుంటాడు. అతని పొరుగువాడు కోవిడ్-19 పాజిటివ్ అని తెలిసినప్పుడు, నాగేశ్వర రావు, “అమ్మో, ఇప్పుడు నేను ఎలా?” అని భయపడతాడు. కానీ తన బాధను దాచుకుని, ఫోన్‌లో కూతురితో మాట్లాడుతూ ధైర్యంగా ఉంటాడు.

రెండవ కథ

మెహ్రునిస్సా (శ్వేతా బసు ప్రసాద్) ముంబైలోని కమాఠీపురలో ఒక వర్కర్. సోషల్ డిస్టన్సింగ్ వల్ల ఆమె వృత్తి కుదేలవుతుంది. మెహ్రునిస్సా జీవితం గందరగోళంలో పడుతుంది. ఆమె ఒక వృద్ధ స్త్రీ (చిత్ర ములానీ) సహాయంతో తన గతాన్ని వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటుంది.

మూడవ కథ

మాధవ్ (ప్రతీక్ బబ్బర్) ఫూల్మతి (సాయి తామ్హంకర్) ఒక పేద దంపతులు. ముంబైలో చాట్ స్టాల్ నడుపుతూ, హౌస్‌మెయిడ్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు. లాక్‌డౌన్ వల్ల వారి ఆదాయం ఆగిపోతుంది. వీళ్ళు తమ ఇద్దరు పిల్లలతో కలిసి బీహార్‌లోని తమ గ్రామానికి నడిచి వెళ్లాలని అనుకుంటారు. ఈ ప్రయాణంలో వారు ఆకలి, అవమానాలు, ఒక లెచరస్ మైగ్రెంట్ బెదిరింపులను ఎదుర్కొంటారు. చివరికి ఫూల్మతి, “మనం ఇంటికి చేరుకుంటాం, మాధవ్!” అని భర్తకి ధైర్యం చెబుతుంది.

నాల్గవ కథ

మూన్ ఆల్వెస్ (ఆహానా కుమ్రా), ఒక కమర్షియల్ పైలట్. లాక్‌డౌన్ వల్ల విమానాలు రద్దవడంతో ఇంట్లో చిక్కుకుంటుంది. ఆమె పొరుగువాడు దేవ్ (సాత్విక్ భాటియా) ఒక కాలేజీ విద్యార్థి. తన గర్ల్‌ఫ్రెండ్ పలక్ (జరీన్ షిహాబ్)తో లాక్‌డౌన్ వల్ల విడిపోతాడు. ఈ సమయంలో మూన్ తో దేవ్ కిస్నేహం కుదురుతుంది. మూన్ “ఇంట్లో బనానా బ్రెడ్ చేస్తున్నా, దేవ్, రుచి చూడు!” అని సరదాగా చెబుతూ, లాక్‌డౌన్ ఒంటరితనాన్ని అతనితో పంచుకుంటుంది. ఈ నాలుగు కథలు ఒకదానితో ఒకటి అనుసంధానం అవుతాయి.

Read Also : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×