BigTV English

Jagan: జగన్‌ ప్లాన్ రివర్స్.. 9 ఎంపీల ఝలక్?.. చంద్రబాబు స్కెచ్ మామూలుగా లేదుగా

Jagan: జగన్‌ ప్లాన్ రివర్స్.. 9 ఎంపీల ఝలక్?.. చంద్రబాబు స్కెచ్ మామూలుగా లేదుగా

Jagan:  మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మళ్లీ అధికారంలోకి రారు.. ఆ పార్టీ పనైపోయింది.. ఇదీ కొద్ది రోజుల కిందట ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చెప్పినమాట. ఆమె మాట అక్షరాలా నిజం అయినట్టు కనిపిస్తోంది. అధికారం లేకపోవడంతో ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు గోడదూకే ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు కూడా.


రివర్స్ అనే పదానికి వైసీపీ అధినేత జగన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా చాలామంది నేతలు చెబుతారు. ఎవరు తీసిన గుంటలో వారే పడతారు అన్నసామెత అచ్చం వైసీపీ అధినేతకు కనెక్ట్ అయ్యింది. రాష్ట్రంలో పవర్ లేక పోయినా.. రాజ్యసభ ఎంపీల ద్వారా అయినా నెట్టుకు రావాలని భావించారు. ఎందుకంటే కేంద్రంలోని బీజేపీకి పెద్దల సభలో పెద్దగా మెజార్టీ లేదు. కచ్చితంగా వైసీపీపై ఆధార పడుతుందని భావించారు. దీంతో కొద్దిరోజులు ధీమాగా ఉన్నట్లు కనిపించారు జగన్.

రాజకీయాలు ఎప్పుడూ ఓకేలా ఉండవు.. పరిస్థితి బట్టి మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. వాటిని తట్టుకుని నిలబడితే సక్సెస్ అయినట్టే. లేకుంటే పార్టీలు ఖతమైన సందర్భాలు దేశంలోని చాలా రాష్ట్రాల్లో కనిపించాయి.  జగన్ ఆలోచనకు భిన్నంగా సీన్ రివర్స్ అయ్యింది. ఫ్యాన్ పార్టీని అంటిపెట్టుకున్న కీలక నేతలు గోడ దూకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పార్టీలో ఏం జరుగుతుందో నేతలకు అంతుబట్టడం లేదు. ఇంతకీ పార్టీ ఉంటుందా.. ఉండదా అనే స్థాయికి దిగిపోయింది.


ALSO READ:  గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. ఒక్కరోజు ముందే నగదు పంపిణీ

వైసీపీలో 11 మంది రాజ్యసభ సభ్యులున్నారు. వారిలో సీనియర్లు, బిజినెస్‌మేన్లు లేకపోలేదు. వ్యాపారవేత్తలు ఎప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల వైపు మొగ్గు చూపుతారు. పార్టీలో కీలకంగా ఉన్న నేతలు ప్రత్యర్థి పార్టీల వైపు చూస్తారు. వైసీపీ విషయంలో కూడా అదే జరిగింది.. జరుగుతోంది కూడా. పొలిటికల్ వర్గాల సమాచారం మేరకు..  9 మంది వైసీపీ రాజ్యసభ ఎంపీలు పార్టీలు మారతారన్నది దాని సారాంశం.

టీడీపీలోకి ముగ్గురు వెళ్లనున్నారు. వారిలో మోపిదేవి వెంకటరమణ, గొల్ల బాబూరావు, బీద మస్తాన్‌రావు ఉన్నారట. బీజేపీలోకి ఐదుగురు ఎంపీలు వెళ్లనున్నారు. రఘునాథ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్‌ నత్వాని ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. జనసేనలోకి ఇద్దరు నేతలు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. వారిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ కృష్ణయ్య ఉన్నట్లు తెలుస్తోంది. చివరకు వైసీపీలో కేవలం ఇద్దరు మాత్రమే మిగులుతారన్నమాట. వారిలో ఒకరు విజయసాయిరెడ్డి, మరొకరు వైవీ సుబ్బారెడ్డి మాత్రమే.

నేతల ఇలా గోడ దూకడానికి కారణాలు చాలానే ఉన్నాయట. అధికారం పోయిన తర్వాత ముఖ్యనేతలతో జగన్ మాట్లాడిన సందర్భాలు లేవని తెలుస్తోంది. పార్టీలో కొందరితో మాత్రమే మాట్లాడుతున్నా రన్నది దాని సారాంశం. పార్టీలో అంతా వన్ మేన్ షో మాదిరిగా జరుగుతుందట. ఎంపీలు అయినా కార్యకర్తల మాదిరిగానే చూస్తారట. ఈ వ్యవహారమే చాలామంది నేతలకు ఎక్కడో తగలిరాని చోట తగిలింది.

అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు జాగ్రత్తగా ఉన్నారు ఆ పార్టీ నేతలు. ఎలాంటి ఆరోపణలు చేయలేకుండా సైలెంట్‌గా ఎవరి ఇంటిని వారు చక్కబెట్టుకుంటున్నారు. వైసీపీలో జరుగుతున్న పరిణామాలను గమనించిన సీఎం చంద్రబాబు.. పార్టీలోకి వచ్చేవారు పదవులకు రాజీనామా చేసి రావాలని మెలిక పెట్టారు. ఏపీలో ప్రతిపక్షం లేదు. పదవులకు నేతలు రాజీనామా చేసినా మళ్లీ వారికే ఛాన్స్ వస్తుందన్న నమ్మకంతో కొందరు నేతలు రాజీనామాలు చేస్తున్నారు.  ఎంపీల తర్వాత నెక్ట్స్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ లైన్‌లో ఉన్నట్లు సమాచారం.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×