BigTV English

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Monal Gajjar : బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా చాలామంది ఫేమస్ అయ్యారు. అయితే ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుందని అంటున్నారు. ఈ షో ద్వారా కొందరి లైఫ్ ఊహకు అందని విధంగా మారితే.. మరికొందరు లైఫ్ ఊహించుకోలేని విధంగా మారిపోయింది.. ఈమధ్య బిగ్ బాస్ కి వెళ్లక ముందు స్టార్ ఇమేజెస్ ను సంపాదించుకున్న వాళ్ళందరూ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మోనాల్ గజ్జర్ గురించి… ప్రస్తుతం ఈ అమ్మడు ఏం చేస్తుంది అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


బిగ్ బాస్ తర్వాత కనిపించని మోనాల్…

బుల్లి ధరపై ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్.. ఈ షో లో కొందరు యాక్టింగ్ తో, ఆటతో ప్రేక్షకుల మనసుని దోచుకున్నారు. సినిమాల్లో వరసగా అవకాశాలను కూడా అందుకుంటున్నారు. కొందరు సినిమాల నుంచి ఈ షోకి వచ్చిన వారి లైఫ్ ఇప్పుడు ఆగమ్య గోచరంగా మారింది. అందులో హీరోయిన్ మోనాల్ గజ్జర్ పరిస్థితి అలానే మారింది. అడపా దడపా సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది.. తన అందంతో ఎంతగానో ఆకట్టుకుంది. కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దర్శక నిర్మాతలు మాత్రం ఆమెను పక్కన పెట్టేశారు. ఆమె కేవలం బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ వచ్చింది. ఈ మధ్య అసలు ఎక్కడ కనిపించలేదని తెలుస్తుంది..


మోనాల్ ఎక్కడ..?

బిగ్ బాస్ సీజన్ 4లో ఈ అమ్మడు తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందంతో ప్రేక్షకులను అలరించింది.. అఖిల్ సార్ధక్ తో ప్రేమాయణం నడిపి పాపులర్ అయింది. అలాగే తన అందాలతో కుర్రాళ్లను కవ్వించింది. అలాగే హౌస్ లో అఖిల్ తో ప్రేమాయణం సాగించి మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.. తెలుగు సినిమాలో ఈమధ్య ఎక్కడా కనిపించలేదు మోనాల్.. కేవలం గుజరాతి సినిమాల్లోనూ అటు సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు మెరుస్తుంది. తన సొంత ఊరు అయిన అహ్మదాబాద్ లోనే ఆమె ప్రస్తుతం ఉంటుంది. ఇక ముందు ఏదైనా సినిమాలో నటిస్తుందేమో చూడాలి.. బిగ్ బాస్ వల్ల లైఫ్ లాస్ అయిన వారిలో ఈమె బాధితురాలే.

Also Read:  నరసింహుడి ఉగ్రతాండవం ఇప్పటిల్లో తగ్గేట్టులేదే.. 200 కోట్ల రాబడుతుందా..?

ఈమె నటించిన సినిమాలు.. 

గుజరాతి అమ్మాయి అయిన మోనాల్ అల్లరి నరేష్ తో సినిమాలు చేసింది మోనాల్. 2012 లో వచ్చిన సుడిగాడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మోనాల్. ఆతర్వాత వెన్నెల 1 1/2, ఒక కాలేజ్ స్టోరి, బ్రదర్ అఫ్ బొమ్మలిలాంటి సినిమాలు చేసింది ఈ చిన్నది. ఇదే ఆమె చివరి సినిమా.. ఎవరైనా ముందుకొచ్చి ఈ అమ్మకు చాన్స్ ఇస్తే మళ్లీ తన కెరీర్ ని స్టార్ట్ చేస్తుంది. మరి ఏ డైరెక్టర్ ఒక ఛాన్స్ ఇస్తాడు చూడాలి…

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Big Stories

×