Intinti Ramayanam Today Episode August 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని రాజేంద్రప్రసాద్ దగ్గరికి వచ్చి మావయ్య గారు మీకు ఏమైనా కాఫీ తీసుకు రమ్మంటారా అని అడుగుతుంది. కానీ రాజేంద్రప్రసాద్ నాకు ఇప్పుడు ఏం వద్దమ్మా అని అంటాడు.. ప్రణతి పూజ చేస్తే హారతి తీసుకొని వస్తుంది. నేను ఉదయం పూజ చేశాను కదా ప్రనితి నువ్వు మళ్ళీ ఇప్పుడు చేసావ్ ఏంటి అని అడుగుతుంది. అవని.. ఈరోజు ఇంటర్వ్యూ ఉందని భరత్ వెళ్ళాడు వదిన అది ఖచ్చితంగా రావాలని పూజ చేశాను అని అంటుంది.
కచ్చితంగా ఈ జాబ్ తనకే వస్తుంది అని అవని అంటుంది. రాజేంద్రప్రసాద్ ఈ జాబు లేకపోయినా ఏదో ఒక జాబ్లో నేను పెట్టిస్తాను అని అంటాడు. అప్పుడే అవనికి ఫోన్ వస్తుంది. భరత్ మీ తమ్ముడేనా అతన్ని అరెస్ట్ చేసాము మీరు పోలీస్ స్టేషన్ కి రండి అని ఎస్ఐ ఫోన్ చేస్తాడు. ఆ మాట వినగానే అవని ప్రణతి రాజేంద్ర ప్రసాద్ ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు.. బెయిల్ రావడంతో ఇంటికి తీసుకొస్తుంది. భరత్ ను అక్షయ్ దారుణంగా కొడతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. భరత్ బ్రోతల్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇలాంటి వాడితో నా చెల్లి పెళ్లి చెయ్యాలా అని అక్షయ్ అడుగుతాడు. అంతేకాదు ఎవరు ఎంత చెప్తున్నా సరే వినకుండా అక్షయ్ భరత్ ను చావగొడతాడు. అవని ఎంతగా అడ్డుపడుతున్న సరే ఇలాంటి వాడికి నా చెల్లిని ఇచ్చి తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా అంటూ అవన్నీ కూడా తిడుతూ భరత్ ని దారుణంగా కొడతాడు అక్షయ్.. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా చేయడం మంచిది కాదు అని రాజేంద్రప్రసాద్ అనడంతో ఆగుతాడు.. ఇక అప్పుడే వచ్చిన పార్వతి.. ఛీ ఇలాంటి వాడికి నా కూతురునిచ్చి గొంతుకొయ్యాలని చూస్తున్నావా అని అవని పై సీరియస్ అవుతుంది.. ఇలాంటివాడు ఎలాంటివాడు మీకు తెలీదా.. వీడు ఒక గాలి వెధవ జూలై వాడు తిరుగుబోతు అని మీకు అర్థం అవ్వలేదా.. నా కూతురు విషయంలో నా నిర్ణయం ఫైనల్ అని అంటుంది పార్వతి..
ఇలాంటి వాడికి మన ప్రణతినిస్తే తన జీవితం ఎలా మారిపోతుందో అర్థమవుతుంది కదా అత్తయ్య అని పల్లవి మధ్యలోకి వస్తుంది.. భరత్ నీ పల్లవి కొట్టబోతుంది. పల్లవి చేతిని పట్టుకున్న అవని నా తమ్ముని కొట్టడానికి నువ్వెవరు అని అంటుంది. ఇలాంటి పనులు చేసిన వారిని ఎలా వెనకేసుకొస్తుందో చూశారా అని పల్లవి అంటుంది. అసలు నిజానిజాలు ఏంటో తెలియకుండా ఇలా నిందలు వేస్తే మర్యాదగా ఉండదని అవని పల్లవికి వార్నింగ్ ఇస్తుంది.
నా తమ్ముని అన్యాయంగా ఎక్కించిన వాళ్ళు ఎవరో నేను కచ్చితంగా కనిపెడతాను అప్పుడు వాళ్లకి ఉంటుంది అని పల్లవి తో అవని అంటుంది. అవని మాటలు విన్న పల్లవి టెన్షన్ పడుతుంది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావ్ పల్లవి అని అడుగుతుంది అవని. టెన్షన్ ఏముంది ఇలాంటి వాడికి ప్రణతిని ఇస్తే తన జీవితం ఏమవుతుందని ఆలోచిస్తున్నాను అని అంటుంది. ఇలాంటి మంచి ఆలోచనలు కూడా నీకు వస్తున్నాయని అవని పల్లవి పై కోపాన్ని తీర్చుకుంటుంది.
ఆ తర్వాత రోజు భరత్ ని స్టేషన్ కి తీసుకెళ్లి శ్రీకర్ అవని సైన్ చేయిస్తారు. అక్కడ ప్రణతి కోసం చూసిన పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న ఫోటోలను చూసి అవన్నీ షాక్ అవుతుంది. ఇదేంటి వీళ్ళ ఫోటోలు ఇక్కడ ఉన్నాయి అని అవని అక్కడే ఉన్న ఎస్ఐ ని అడుగుతుంది.. ఆయన చెప్పిన నిజంతో మైండ్ బ్లాక్ అవుతుంది.. ఇలాంటి వాడిని నా అత్తయ్య ప్రణతికించి పిలిచాలనుకుంటుంది వెంటనే ఈ విషయాన్ని అత్తయ్యకి చెప్పాలి అని ఫోన్ చేస్తుంది.. ఫోన్ లిఫ్ట్ చేసిన పార్వతి వెటకారంగా మాట్లాడుతుంది.
నువ్వేంటి నాకు ఫోన్ చేసావ్ అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని పార్వతి అంటుంది. నేను ఒక విషయం చెప్పాల అత్తయ్య మీరు కచ్చితంగా రావాలి. ఆ తర్వాత నేను చెప్పింది చూసి మీరు నన్ను చెప్పుతో కొట్టిన నేను పడతాను అని అంటుంది. అవని మాట విన్న పార్వతి ఒక్కటే పోలీస్ స్టేషన్ కి వెళుతుంది. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు ఏమైంది అని అడుగుతుంది పార్వతి. మీరు ఒకసారి లోపలికి రెండు అత్తయ్య అని అవని పార్వతిని లోపలికి తీసుకెళ్తుంది. అక్కడ హిట్ లిస్టులో ప్రణతి కోసం చేసిన పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న ఫోటోలను చూసి పార్వతీ షాక్ అవుతుంది.
Also Read:మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..
వీళ్ల ఫోటోలు ఎక్కడున్నా ఏంటి అని ఎస్ఐ ని అడుగుతుంది. వీళ్ళిద్దరూ నెంబర్ వన్ ఫ్రాడ్లు. తండ్రి ఏమో కొడుకుకి పెళ్లి సంబంధాలు చూస్తాడు.. కొడుకేమో అమ్మాయిలని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బు నగలను కొట్టేసి పారిపోతాడు. ఇప్పటికే వీరిద్దరిపై చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఇదే అరెస్ట్ చేస్తామని ఎస్సీ చెప్పదని ఆ మాట విని పార్వతి షాక్ అవుతుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఇలాంటి సంబంధాన్ని తీసుకొచ్చిన చక్రధర్ పల్లవిలపై పార్వతీ సీరియస్ అవుతుందా? అవని నీకు క్షమించేసి ఇంటికి తీసుకోస్తుందా చూడాలి..