BigTV English

War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.. కానీ ఆంక్షలు తప్పనిసరి!

War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.. కానీ ఆంక్షలు తప్పనిసరి!

War 2:ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) ‘వార్’ మూవీకి కొనసాగింపుగా చేస్తున్న చిత్రం వార్ 2 (War 2). హై యాక్షన్ పర్ఫామెన్స్ తో భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఆగస్టు 14న విడుదల కాబోతోంది. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR ) విలన్ గా నటిస్తున్నారు. అంతేకాదు ఆయన తొలి హిందీ చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. దీనికి తోడు ఈ సినిమా అటు హిందీ ఇటు తెలుగు, తమిళ్ వెర్షన్ లలో.. మొత్తం రెండు వెర్షన్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవల రన్ టైం కూడా లాక్ చేసుకుంది. మరోవైపు హిందీ.. తెలుగు, తమిళ్ భాషలతో పోల్చుకుంటే రెండు నిమిషాల నిడివి హిందీలోనే ఎక్కువగా ఉంది.


ఘనంగా వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ వేదికగా చాలా ఘనంగా నిర్వహించనున్నారు. అయితే వర్షాలు కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు తప్పనిసరి అని సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాదులోని యూసుఫ్ గూడా లోని KVBR స్టేడియంలో వార్ 2 ప్రీ రిలీజ్ వేడుక చాలా ఘనంగా జరగనుంది. ఈరోజు సాయంత్రం 5:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు జరిగే ఈ వేడుక సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీసులు తెలిపారు. అసలే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మూవీ కలయికలో వస్తున్న సినిమాపై కంటే హీరోలను నేరుగా చూసే అవకాశం ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ ప్రీ రిలీజ్ వేడుకకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారని, అసౌకర్యాన్ని నివారించడానికే ప్రయాణికులు కేవీబీఆర్ స్టేడియం వైపు వెళ్లకుండా ఉండాలని సూచించారు.


ఈరోజు సాయంత్రం అటువైపు వెళ్లకపోవడమే మంచిది..

దీనికి తోడు వర్షాల కారణంగా యూసఫ్ గూడాలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈవెంట్తో ట్రాఫిక్ జామ్ సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆల్టర్నేట్ చూసుకుంటే శ్రీనగర్ – అమీర్పేట్ రోడ్డు చిన్నగా ఉంటుంది. ఈ రోడ్ నుంచి ట్రాఫిక్ ను మళ్లించడం పోలీసులకు చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే ఈరోజు ఈవినింగ్ యూసఫ్ గూడా సైడ్ వెళ్లకుండా ఉంటేనే బెటర్ అని చెప్పవచ్చు. ఈ ట్రాఫిక్ ను ప్రజలు దృష్టిలో పెట్టుకొని తమ అసౌకర్యాన్ని దూరం చేసుకోవాలని కూడా ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.

వార్ 2 సినిమా విశేషాలు..

వార్ 2 సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara advani) హీరోయిన్గా నటిస్తోంది. అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee)దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా (Adithya chopra) భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేయగా పరవాలేదు అనిపించుకుంది.. దీనికి తోడు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య ఉండే ఐటెం సాంగ్ టీజర్ ని కూడా విడుదల చేశారు. ఇక ఫుల్ పాట నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×