E-Paper
Advertisement

ఘోర ప్రమాదం.. డంపర్‌ను ఢీకొట్టిన స్కోర్పియో, ఐదుగురు మృతి-రాజస్థాన్‌‌లో ఘటన

ఘోర ప్రమాదం.. డంపర్‌ను ఢీకొట్టిన స్కోర్పియో, ఐదుగురు మృతి-రాజస్థాన్‌‌లో ఘటన
Advertisement

Rajasthan: రోడ్డు మీద వెళ్లేటప్పుడు జాగ్రత్త అని పదే పదే పోలీసులు చెబుతున్నా వాహనాదారులు ఏమాత్రం వినలేదు. ఫలితంగా  ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన స్కోర్పియో.. డంపర్‌ను బలంతా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్‌లో మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ఎలా జరిగింది?

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం-రాజస్థాన్ బలోత్రా జిల్లాలోని భండియావాస్ సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వస్తున్న స్కార్పియో వాహనం.. ముందు వెళ్లున్న డంపర్ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కార్పియో ముందు పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో స్కార్పియో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

విహారయాత్రలో విషాదం-మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు కానోడ్ గ్రామానికి చెందినవారు గుర్తించారు పోలీసులు. కానోడ్ గ్రామానికి చెందిన యువకులు సెలవు రోజు కావడంతో విహార యాత్రకు బయలుదేరారు. పర్సాలా ప్రాంతానికి వెళ్లి స్కార్పియో‌లో తిరిగి వస్తున్నారు.  భాండియావాస్ సమీపంలోకి రాగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మృతులు ఒకే గ్రామానికి చెందిన యువకులు-స్కార్పియో వాహనం వేగానికి ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. స్పాట్‌లో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని చికిత్స  కోసం జోధ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో తీవ్రగాయాలతో మరో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.

Advertisement

ALSO READ: ప్రకృతి ఒడిలో సరికొత్త చరిత్ర.. గంటలో 3.61 లక్షల మొక్కలతో గుజరాత్ గిన్నిస్ రికార్డు

ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రమాదం నేపథ్యంలో జోధ్‌పూర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కిలో మీటర్ల మేరా వాహనాలు నిలిచిపోయాయి.

మృతదేహాలను వెలికి తీసిన తర్వాత వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై ఫోకస్ చేశారు. ప్రాథమికంగా అతివేగం ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని, ప్రమాదానికి సంబంధించి అన్ని ఆధారాలను సేకరిస్తున్నట్లు వివరించారు.

Related News

ఇంగువలో నాణ్యతా లోపాలు.. ఎవరెస్ట్, లాల్‌జీ గోధూ ఉత్పత్తులపై FSSAI నిషేధం!

నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈఓ గోపిశెట్టి గల్లంతు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు, కంపెనీ ప్రకటన

డ్రోన్ ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదులకు సిమ్ కార్డులు సప్లై.. నిందితుడి అరెస్ట్!

బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ.. మమతా బెనర్జీపై కేసు నమోదు

ఇండియాలో తగ్గిపోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. ఇతర రంగాల్లోనూ ఏఐ తప్పనిసరి

చిన్నారి ప్రాణాల మీదికి తెచ్చిన ఎక్స్‌పైరీ స్నాక్స్.. కట్ చేస్తే అధికారి నోట్లోనే పెట్టిన స్థానికులు!

వరల్డ్ బ్యాంక్‌లో జాబ్ కావాలా? ఇదిగో లక్కీ ఛాన్స్

కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. రూ.89 కోట్ల స్కామ్ సెగ.. కన్నీళ్లతో మంత్రి నాగేంద్ర రాజీనామా!

Big Stories

Advertisement
×