E-Paper
Advertisement

సామాన్యుడిలా బస్సులో మంత్రి.. బస్సు స్టాప్‌లో ఆపని డ్రైవర్, కండక్టర్ సస్పెండ్!

సామాన్యుడిలా బస్సులో మంత్రి.. బస్సు స్టాప్‌లో ఆపని డ్రైవర్, కండక్టర్ సస్పెండ్!
Advertisement

Karnataka Transport: ప్రభుత్వ బస్సులో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవాలని కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సాధారణ దుస్తుల్లో ప్రయాణికుడిగా బస్సు ఎక్కిన మంత్రి, సిబ్బంది తీరును స్వయంగా గమనించి, తప్పు చేసిన వారిపై మెరుపు వేగంతో చర్యలు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

మంత్రి గారి మాస్టర్ ప్లాన్

Advertisement

బెంగళూరు నగరంలో ప్రభుత్వ బస్సుల పనితీరు, సిబ్బంది ప్రవర్తనపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను మంత్రి సీరియస్‌గా తీసుకున్నారు. తన హోదాను పక్కనపెట్టి, సామాన్య ప్రయాణికుడిలా బస్సు ఎక్కారు. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో, డ్రైవర్ ఒక నిర్ణీత బస్ స్టాప్‌లో ప్రయాణికులు ఉన్నప్పటికీ బస్సును ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు. ప్రయాణికుల అసౌకర్యాన్ని గమనించిన మంత్రికి, సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం కలిగింది.

Also Read: విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 7 ప్రైవేట్ బస్సులు దగ్ధం!

Advertisement

తక్షణ చర్య.. కఠిన హెచ్చరిక

వెంటనే స్పందించిన మంత్రి, నిబంధనలను ఉల్లంఘించి, ప్రయాణికులను ఇబ్బంది పెట్టినందుకు సదరు డ్రైవర్,కండక్టర్‌లను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా రవాణా వ్యవస్థలో బాధ్యతాయుతంగా ఉండాలని, నిర్ణీత స్టాప్‌లలో బస్సులను ఆపడం కనీస బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనతో రవాణా శాఖ సిబ్బందిలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఏ క్షణంలో ఏ అధికారి తనిఖీ చేస్తారో అన్న భయం సిబ్బందిలో పెరిగింది. ప్రయాణికుల సౌకర్యమే పరమావధిగా సిబ్బంది పని చేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని మంత్రి ఈ ఉదంతం ద్వారా గట్టి సంకేతాలను పంపారు.

Related News

ఇంగువలో నాణ్యతా లోపాలు.. ఎవరెస్ట్, లాల్‌జీ గోధూ ఉత్పత్తులపై FSSAI నిషేధం!

నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈఓ గోపిశెట్టి గల్లంతు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు, కంపెనీ ప్రకటన

డ్రోన్ ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదులకు సిమ్ కార్డులు సప్లై.. నిందితుడి అరెస్ట్!

బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ.. మమతా బెనర్జీపై కేసు నమోదు

ఇండియాలో తగ్గిపోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. ఇతర రంగాల్లోనూ ఏఐ తప్పనిసరి

చిన్నారి ప్రాణాల మీదికి తెచ్చిన ఎక్స్‌పైరీ స్నాక్స్.. కట్ చేస్తే అధికారి నోట్లోనే పెట్టిన స్థానికులు!

వరల్డ్ బ్యాంక్‌లో జాబ్ కావాలా? ఇదిగో లక్కీ ఛాన్స్

కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. రూ.89 కోట్ల స్కామ్ సెగ.. కన్నీళ్లతో మంత్రి నాగేంద్ర రాజీనామా!

Big Stories

Advertisement
×