E-Paper
Advertisement

సాయి పల్లవికి పోటీగా బాలయ్య కూతురు.. ‘సారంగదరియా’ పాటకు తేజస్విని ఊరమాస్ స్టెప్పులు!

సాయి పల్లవికి పోటీగా బాలయ్య కూతురు.. ‘సారంగదరియా’ పాటకు తేజస్విని ఊరమాస్ స్టెప్పులు!
Advertisement

Tejaswini Dance: నందమూరి ఫ్యామిలీ నుండి బాలయ్య, తారక్,కళ్యాణ్ రామ్ అంటూ హీరోలే తప్ప హీరోయిన్స్ కాని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కాని ఎవరూ వచ్చింది లేదు. వెండి తెరపై ఎంట్రీ ఇవ్వకున్నా అడపాదడపా తమ టాలెంట్ ని ప్రైవేట్ ఫంక్షన్స్ లోనో, సింగిల్ గా వీడియోలో బయటపెడుతూనే ఉంటారు.అలా వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాలయ్య చిన్న కూతురు తేజస్విని గురించి.తమ్ముడు మోక్షు ఎంట్రీ గురించి అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే ఆ గ్యాప్ ని ఇదిగో ఇలా భర్తీ చేస్తానంటూ తనదైన డాన్సింగ్ టాలెంట్ ని బయటపెడుతుంది.

 అభిమానులకి పూనకాలు తెప్పిస్తున్న తేజస్విని

Advertisement

ఇలా రెండు నెల్ల కిందటే కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ తో కలిసి సాలిడ్ స్టెప్పులతో అదరగొట్టిన ఈ నందమూరి చిన్నది తాజగా మరోసారి తనలోని డాన్స్ ని బయటపెట్టింది. ఇక ఈ సారి తను ఎంచుకున్న పాట లవ్ స్టోరీలో మంగ్లీ పాడిన ‘సారంగదరియా’ అనే ఫోక్ టచ్ ఉన్న సాంగ్ ని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ఈ పాట అప్పట్లో ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు.ఒక రకంగా సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఈ పాట కూడా తన వంతు పాత్ర పోషించిందని చెప్పక్కర్లేదు.ఇపుడు ఆ పాటకే మరోసారి భాను మాస్టర్ కంపోజిషన్ లో స్టెప్పులు వేసి అభిమానులకి పూనకాలు తెప్పిస్తుంది.

also read:రాముడి వేషంలోనే సిగరెట్లు.. ఎన్టీఆర్ ముందే అలా.. ఆ తప్పులే కెరీర్‌ను ముంచేశాయా?

Advertisement

సాయి పల్లవి డ్యాన్స్ రికార్డులకు గట్టి కాంపిటీషన్

మాములుగా రెగ్యులర్ గా డాన్స్ లు చేసే హీరోయిన్స్, ప్రొఫెషనల్ డాన్సర్స్ కి మాత్రమే సొంతమైన గ్రేస్ అండ్ ని మిక్స్ తేజస్విని తన డాన్స్ లో చూపడం ఇక్కడ విశేషం. ఇక ఈ డాన్స్ ని చూసిన నెటిజన్లు హీరోయిన్లకి కాంపిటీషన్ ఇస్తున్నారుగా..మీరు గనుక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే చాలా మంది తట్టా బుట్టా సర్డుకోవాలసిందే అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు .ఇంకొంతమంది సాయి పల్లవి డ్యాన్స్ రికార్డులకు గట్టి కాంపిటీషన్ వచ్చేలా ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే” అంటుంటే మరికొంతమంది మోక్షు ఎలాగూ హీరో గా ఎంట్రీ ఇచ్చేలా కనిపించట్లేదు .కనీసం మీరైనా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి బాలయ్య లెగసీని కంటిన్యూ చేయండి అంటూ కామెంట్స్ వదులుతున్నారు.

 ఏమైనా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా 

ఇక తేజస్విని విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ, వసుంధరలకి రెండో సంతానమైన ఈ అమ్మడు విశాఖపట్నంలోని ప్రసిద్ధ గీతం (GITAM) యూనివర్సిటీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీభరత్ (మతుకుమిల్లి శ్రీభరత్) ని 2013 ఆగస్టు 21న హైటెక్స్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే. ఇక ఈ శ్రీభరత్ ఎవరో కాదు మాజీ ఎంపీ అయిన స్వర్గీయ డాక్టర్ ఎం.వి.వి.ఎస్. మూర్తి గారి మనవడని చెప్పక్కర్లేదు. ఏది ఏమైనా ఇంతటి టాలెంట్ ని తనలో దాచుకున్న ఈ నందమూరి భామ ముందు ముందు ఏమైనా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా చూడాలి !

also read:బాలీవుడ్ నటుడి లవ్ అఫైర్స్ రచ్చ.. ఒకరితో ఎంగేజ్మెంట్.. మరొకరితో డేటింగా?

Related News

Rashmika Mandanna : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. రష్మిక సినిమాలకు గుడ్ బై చెప్తుందా..?

తిరుపతినైనా ఎదిరిస్తా.. నిన్ను మాత్రం వదలను మంగ.. ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్!

పవన్ కళ్యాణ్ కి శస్త్రచికిత్స పూర్తి.. వైద్యులు ఏమన్నారంటే?

ఇండస్ట్రీలో కలకలం.. జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ మధ్య వాగ్వాదం!

అనిరుధ్ – కావ్య పెళ్లి ఫిక్స్.. ఆ ముహూర్తం ఎప్పుడంటే?

జానీ మాస్టర్ భార్య సుమలతపై డాన్సర్లు ఆగ్రహం.. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్!

సింగర్ ఎస్.జానకి నటించిన మూవీ.. డిలీటెడ్ సీన్ వైరల్!

Big Stories

Advertisement
×