E-Paper
Advertisement

ట్విస్ట్ అంటే ఇది.. పెన్షన్ డబ్బుల కోసం వెళ్తే.. అకౌంట్లో రూ.759 కోట్లు! చూసి షాకైన వృద్ధుడు

ట్విస్ట్ అంటే ఇది.. పెన్షన్ డబ్బుల కోసం వెళ్తే.. అకౌంట్లో రూ.759 కోట్లు! చూసి షాకైన వృద్ధుడు
Advertisement

Bank Account: బ్యాంక్ ఖాతాలో వందల రూపాయల పెన్షన్ డబ్బుల కోసం వెళ్తే.. ఏకంగా వందల కోట్లు దర్శనమిస్తే ఎలా ఉంటుంది? కచ్చితంగా మాటలు రావు, కాసేపు మైండ్ బ్లాక్ అవుతుంది. సరిగ్గా ఇలాంటి విచిత్రమైన, నమ్మశక్యం కాని ఘటనే బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. ముసలి వయసులో ఆసరాగా నిలిచే ప్రభుత్వ పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు వెళ్లిన ఓ వృద్ధుడికి, ఆయన కుమారుడికి బ్యాంకు ఖాతాలు చూపించిన షాక్ అంతా ఇంతా కాదు. రాత్రికి రాత్రే వారు కోటీశ్వరులు కాదు, ఏకంగా శతకోటీశ్వరులైపోయారు.

ఒకే కుటుంబంలో ఇద్దరు బిలియనీర్లు
ముజఫర్‌పూర్‌కు చెందిన 82 ఏళ్ల కమేశ్వర్ మిశ్రా వృత్తిరీత్యా కవి. ఆయనకు లభించే వృద్ధాప్య పెన్షన్ డబ్బులను విత్‌డ్రా చేసుకునేందుకు తన కుమారుడితో కలిసి సమీపంలోని సీఎస్‌సీ వెళ్లారు. ఆయన కుమారుడు కూడా వికలాంగుల పెన్షన్ లబ్దిదారుడే. సాధారణంగా వచ్చే పెన్షన్ సొమ్మును చేతికి తీసుకున్న తర్వాత, మిశ్రా సరదాగా తన అకౌంట్లో ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందో చూడాలన్నారు. ఆపరేటర్ కంప్యూటర్ స్క్రీన్ వైపు చూడగానే ఇద్దరి కళ్లూ బైర్లు కమ్మాయి. ఆయన ఖాతాలో ఏకంగా రూ. 759,69,51,951 ఉన్నట్లు చూపెట్టింది. అనుమానం వచ్చి కుమారుడి అకౌంట్ చెక్ చేయగా.. అందులోనూ దాదాపు అంతే మొత్తం ఉంది. తండ్రీ కొడుకుల ఖాతాల్లో కలిపి ఏకంగా రూ. 1,500 కోట్లకు పైగా దర్శనమివ్వడంతో అక్కడి వారంతా నోరెళ్లబెట్టారు.

Advertisement

నిజాయితీ చాటుకున్న వృద్ధ కవి
అంత డబ్బు చూసి సామాన్యులెవరైనా ఆశ పడతారేమో కానీ, ఆ వృద్ధ కవి మాత్రం కంగారుపడ్డారు. ఇది తన కష్టార్జితం కాదని, ఇందులో ఏదో పెద్ద పొరపాటు జరిగిందని గ్రహించారు. వెంటనే ఈ విషయాన్ని దాచకుండా బహిరంగంగా ప్రకటించి తన నిజాయితీని చాటుకున్నారు. “నా అకౌంట్ లోకి అంత భారీ మొత్తం ఎలా వచ్చిందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇది కచ్చితంగా ఏదో పొరపాటే. సంబంధిత బ్యాంకు అధికారులు వెంటనే స్పందించి, విచారణ జరిపి ఈ తప్పును సరిదిద్దాలి” అని కమేశ్వర్ మిశ్రా అధికారులను కోరారు.

ఇంతకీ అసలు కారణం ఏమై ఉంటుంది?
ఈ నమ్మశక్యం కాని ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. అయితే, ఈ వ్యవహారంపై బ్యాంకు యాజమాన్యం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సాధారణంగా బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవుతున్నప్పుడు లేదా డేటా ఎంట్రీ సమయంలో జరిగే సాంకేతిక లోపాల వల్ల ఇలాంటి డిజిటల్ తప్పిదాలు జరుగుతుంటాయని నిపుణులు చెప్తున్నారు. గతంలోనూ దేశంలో అక్కడక్కడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగాయి. ఏదేమైనా, ఈ రూ. 1,500 కోట్ల మిస్టరీ వెనుక ఉన్న అసలు కారణం తెలియాలంటే బ్యాంకు అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు జరపాల్సిందే.

Advertisement

Also Read: ప్రకృతి ఒడిలో సరికొత్త చరిత్ర.. గంటలో 3.61 లక్షల మొక్కలతో గుజరాత్ గిన్నిస్ రికార్డు

Related News

నాలుగేళ్లు రిలేషన్ షిప్.. ఉదయం పెళ్లి సాయంత్రం విడిపోయారు, పెళ్లికొడుకు అసలు రూపం

జర్మనీలో షాకింగ్ కేసు కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబో!

‘చెవి కొరికి తినేసి.. ఇప్పుడేమో ముందస్తు బెయిలా?’.. నిందితుడిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దసరాకి బోనస్..?

‘బ్లూ డ్రమ్’ కేసులో సంచలన తీర్పు.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణ శిక్ష ఖరారు!

పొయ్యిలో 20కి పైగా పాములు.. ఏకంగా పిల్లలతో కాపురం పెట్టేసిందిగా? ధైర్యం ఉంటేనే చూడండి

ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

Big Stories

Advertisement
×