E-Paper
Advertisement

Gurugram: టెక్కీ ఎంత పని చేశాడు.. ప్రియురాల్ని పొడిచి చంపి, ఆ తర్వాత ఏం చేశాడంటే

Gurugram: టెక్కీ ఎంత పని చేశాడు.. ప్రియురాల్ని పొడిచి చంపి, ఆ తర్వాత ఏం చేశాడంటే
Advertisement

Gurugram: భార్యాభర్తల మధ్యే కాదు.. ప్రియుడు-ప్రియురాల మధ్య మనస్పర్థలు తీవ్రమవుతున్నాయి. ఫలితంగా చంపుకునే ఘటన క్రమంగా జోరుందుకుంటున్నాయి. తాజాగా గురుగ్రామ్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..  తన ప్రియురాలిని కత్తితో పొడిచి చంపేశాడు. ప్రియురాలి లేని లోకంలో ఉండలేనని భావించి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

గురుగ్రామ్‌లో దారుణమైన ఘటన-హర్యానా గురుగ్రామ్‌లోని సైబర్ సిటీలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రేష్ఠ- ఇషాకాలకు చాలా కాలంగా పరిచయం ఉంది. శ్రేష్ఠ మాలిక్ సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అతడు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవాడు, గురుగ్రామ్‌లోని ఓ ఐటీ ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

Advertisement

ప్రియురాల్ని దారుణంగా హత్య చేసిన టెక్కీ-శనివారం సెక్టార్ 55లో ఇషాకా ఉన్న ఫ్లాట్‌కు శ్రేష్ఠ వచ్చాడు. అంతకుముందు ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలీదు. ఆ తర్వాత మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా తీవ్రరూపం దాల్చడంతో శ్రేష్ఠ ఆగ్రహంతో ఊగిపోయాడు. గదిలో ఉన్న కత్తి తీసుకుని ఇషాకాను పదే పదే పొడిచి తన కసి తీర్చుకున్నాడు. ఈ దాడిలో ఇషాకా రక్తంతో తడిసి అక్కడికక్కడే కుప్పకూలింది.

రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న టెక్కీ-యూపీకి చెందిన ఇషాకాకు ఆమె తల్లిదండ్రులు పలుమార్లు ఫోన్ చేశారు. ఆమె నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చిన పేరెంట్స్,  ఏదో జరగరాని  సంఘటన జరిగిందేమోనని భయపడ్డారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

రంగంలోకి దిగిన పోలీసులు, సెక్టార్ 55లో ఇషాకా ఉన్న ఫ్లాట్ తలుపు తెరిచి చూశారు. అప్పటికే నేలపై రక్తంతో ఇషాకా పడి ఉంది. ఈ క్రమంలో ఇషాకా హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు ఓకే. ఇషానా హత్య చేసింది ఎవరు? అనేది మిస్టరీగా మారింది.

ALSO READ: నేను ఆత్మహత్య చేసుకుంటా.. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎందుకు అలా అన్నారు?

ఇషాకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు రైల్వే పోలీసులు మరో సమాచారం ఇచ్చారు. గర్హి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువకుడు రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మృతుడి వద్ద స్వాధీనం చేసుకున్న ఫోన్ ద్వారా గుర్తింపు నిర్ధారించారు పోలీసులు. ఈ ఘటన జరగడానికి మూడు రోజుల ముందు శ్రేష్ఠ, ఇషాకాలు పీజీ వసతి గృహంలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

శ్రేష్ఠ-ఇషాక మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు,  పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ టీమ్ సంఘటనా స్థలం నుండి అనేక ఆధారాలను సేకరించింది. ఘోరమైన చర్య వెనుక అసలు కారణం తెలుసుకోవడానికి ఇద్దరి కాల్ వివరాలు, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు పోలీసులు.

Related News

జర్మనీలో షాకింగ్ కేసు కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబో!

‘చెవి కొరికి తినేసి.. ఇప్పుడేమో ముందస్తు బెయిలా?’.. నిందితుడిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దసరాకి బోనస్..?

‘బ్లూ డ్రమ్’ కేసులో సంచలన తీర్పు.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణ శిక్ష ఖరారు!

పొయ్యిలో 20కి పైగా పాములు.. ఏకంగా పిల్లలతో కాపురం పెట్టేసిందిగా? ధైర్యం ఉంటేనే చూడండి

ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!

Big Stories

Advertisement
×