E-Paper
Advertisement

Rashmika Mandanna : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. రష్మిక సినిమాలకు గుడ్ బై చెప్తుందా..?

Rashmika Mandanna : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. రష్మిక సినిమాలకు గుడ్ బై చెప్తుందా..?
Advertisement

Rashmika Mandanna : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుని రష్మిక మందన్న.. కేవలం తెలుగులో మాత్రమే కాదు.. అటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ వరస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది.. పుష్ప యానిమల్ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించిన రష్మిక సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఆమె పేరే సినిమాని ప్రకటించకపోవడంతో అదే నిజమనే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.. మరి నిజంగానే రష్మిక కొద్ది రోజులు బ్రేక్ తీసుకుంటుందా? లేదంటే ఈమె కూడా ప్రెగ్నెంట్ అనే వార్తని ఫాన్స్ కి చెప్తుందా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.. అసలు రష్మిక ఎందుకు బ్రేక్ తీసుకుంటుంది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న రష్మిక..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న పుష్ప మూవీతో నేషనల్ వైడ్ గా క్రష్ గా మారింది. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ని అందుకుంటూ వస్తుంది. అయితే ఏడాదికి రెండు మూడు సినిమాలు తో ఎప్పుడు పలకరించే రష్మిక ఈ ఏడాది మాత్రం పెద్దగా సినిమాలను అనౌన్స్ చేయలేదు. అంతేకాదు తన పర్సనల్ లైఫ్లో కీలక నిర్ణయం తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. విజయ్ దేవరకొండ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈమె ఇప్పటివరకు మరో సినిమాని ప్రకటించకపోవడంతో సినిమాలకి బ్రేక్ ఇస్తుందా? లేదంటే బుల్లి రష్మిక రాబోతుందని గుడ్ న్యూస్ ని చెప్తుందా అన్నది ప్రస్తుతం ఫాన్స్ లో సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా కూడా రష్మిక మందన్న నెక్స్ట్ మూవీ ని అనౌన్స్ చేసేంతవరకు ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.. మరి ఈ వార్తలకు రష్మిక క్లారిటీ ఇస్తుందేమో చూడాలి..

Advertisement

Also Read : ఈ వారం ఓటీటీ సినిమాలు.. మా ఇంటి బంగారం టు ది డెవిల్ డోంట్ మిస్…

మైసా మూవీతో మరో రికార్డ్..

ప్రస్తుతం రష్మిక మందన్న మైసా మూవీలో నటిస్తుంది. దాంతో పాటుగా విజయ్ దేవరకొండ సరసన జోడిగా రణబాలి చిత్రంలో నటిస్తుంది.. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి. అంతే కాదు.. రీసెంట్గా రష్మిక నటిస్తున్న మైసా మూవీ కోసం భారీ అడ్వెంచర్ని చేస్తుంది. ఈ చిత్రం పూర్తిగా ట్రైబల్‌ బేస్డ్‌ యాక్షన్ ఓరియంటెడ్ కథతో రాబోతోంది. ఇటీవల ఈ మూవీ కోసం చిత్రీకరించిన అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌లో రష్మికా కనబరిచిన పెర్ఫామెన్స్‌కు చిత్ర యూనిట్ సైతం ఫిదా అవుతున్నారు.. ఈ మూవీ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఎప్పుడూ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండే రష్మిక. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎక్కడ ప్రకటించిన దాఖలాలు కనిపించడం లేదు. దాంతో ఈమె సినిమాలకి గుడ్ బై చెప్పిందా అన్న వార్తలు కూడా ఊపొందుకున్నాయి. ఏది ఏమైనా కూడా రష్మిక మందన్న గ్రీన్ సిగ్నల్ ఇస్తే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకి ఆమెకు కథ చెప్పడానికి దర్శకులు లైన్లో ఉంటారు. మరి అలాంటిది రష్మిక ఎందుకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు అన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వార్తలపై ఒక క్లారిటీ రావాలంటే రష్మిక మందన్న రిప్లై ఇచ్చే అంతవరకు వెయిట్ చేయాల్సిందే..

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×