E-Paper
Advertisement

Delhi Politics: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ, సీఎం రేవంత్ హాజరు

Delhi Politics: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ, సీఎం రేవంత్ హాజరు
Advertisement

Delhi Politics: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గురువారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వేగంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక సమావేశాలను ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు. దీనికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్నారు.

గురువారం నుంచి  మూడురోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

Advertisement

గురువారం నుంచి మూడురోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మొదలుకానున్నాయి. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు, ఎంపీ- ఎమ్మెల్యేల నియోజకవర్గాల పునర్విభజనకు ప్రత్యేక సవరణ బిల్లులను తీసుకురానుంది మోదీ సర్కార్. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా వెల్లడించారు.

దేశంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు భేటీ అవుతున్నారు.

Advertisement

ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ.. సీఎం రేవంత్ హాజరు

ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్నారు. బిల్లుల విషయంలో మోదీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్ మిత్రపక్షాలు తప్పుబట్టాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఉభయసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు ఇండియా కూటమి నేతలు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ర్యాలీలు లేదంటే ఆందోళనలు నిర్వహించాలనే దానిపై చర్చించనున్నారు. ఈ విషయంలో ఇప్పటికే డీఎంకే క్లియర్‌గా తన నిర్ణయాన్ని చెప్పేసింది. 1960 నాటికి డీఎంకెను చూస్తారని సీఎం స్టాలిన్ ఓపెన్‌గా చెప్పేశారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ALSO READ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన లేఖ.. మహిళా రిజర్వేషన్లపై ప్రధానికి కీలక సూచనలు

దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రులు సీఎం రేవంత్‌రెడ్డి, సీఎం స్టాలిన్, కేరళ సీఎం విజయన్ సహా విపక్ష పార్టీలు గొంతెత్తాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర‌మోడీకి కాంగ్రెస్ పార్టీతోపాటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి లేఖలు రాశారు. మధ్యాహ్నం భేటీలో దీనిపై కూడా చర్చించనున్నారు. సమావేశంలో భవిష్యత్ కార్యచరణ ప్రకటించనుంది ఇండియా కూటమి.

 

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×