BigTV English

Ayodhya: రాముడి ఫోటో లీక్‌ పై వివాదం.. బాధ్యులను శిక్షించాలని ప్రధాన పూజారి డిమాండ్..

Ayodhya : అయోధ్య లో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకకు ముందే విగ్రహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గర్భగుడిలో విగ్రహ కళ్లకు ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఉన్న రాముడి ఫోటోలు లీక్ అయ్యాయి . ఈ సంఘటనను రామజన్మభూమి ట్రస్ట్‌ సభ్యులు తీవ్రంగా పరిగణించారు. దీనికి బాధ్యులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.

Ayodhya: రాముడి ఫోటో లీక్‌ పై వివాదం..  బాధ్యులను శిక్షించాలని ప్రధాన పూజారి డిమాండ్..
Ayodhya
Ayodhya

Ayodhya : అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకకు ముందే విగ్రహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గర్భగుడిలో విగ్రహ కళ్లకు ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఉన్న రాముడి ఫోటోలు లీక్ అయ్యాయి . ఈ సంఘటనను రామజన్మభూమి ట్రస్ట్‌ సభ్యులు తీవ్రంగా పరిగణించారు. దీనికి బాధ్యులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.


ఈ ఘటనపై శ్రీరామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీరాముడి విగ్రహం కళ్లకు ఆచ్ఛాదనగా వస్త్రం కట్టి గర్భగుడిలో ఉంచామన్నారు. ప్రాణప్రతిష్ఠ సమయంలోనే ఆ వస్త్రాన్ని తొలగిస్తామని తెలిపారు. దీనికి ముందే విగ్రహ స్వరూపం ఫోటోలు విడుదల చేయ్యడం శుభపరిణామం కాదని తెలిపారు . దీనికి బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ ఈ విగ్రహాన్ని రూపొందించారు. 51 అంగుళాల పొడవున్న రామ్‌లల్లా విగ్రహాన్ని ఇటీవల గర్భగుడికి చేర్చారు. నిలబడిన భంగిమలో ఉన్న బాలరాముడి విగ్రహాన్ని విశ్వహిందూపరిషత్‌ విడుదల చేసింది. విగ్రహం కళ్లకు ఆచ్ఛాదనగా పసుపురంగు వస్త్రం కట్టి గులాబీదండతో అలంకరించారు.


పూర్తి రూపంతో ఉన్న విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఆలయ ట్రస్ట్ సభ్యులు అంతర్గత విచారణ చేపట్టారు. ఆలయంలో ఉన్న సిబ్బందే ఈ పని చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ నెల 22 న విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీ చేతుల మీదగా వేద పండితులు, అర్చకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. మోదీ రాముడి విగ్రహానికి కళ్లకు ఉన్న గంతలు తొలగించి దర్శనం చేసుకోనున్నారు.

Tags

Related News

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Big Stories

×