Indonesia News: ఇండోనేసియా లో నిర్మాణంలోవున్న ఓ స్కూల్ బిల్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో 65 మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నారు. శిథిలాల కింద ఉండేవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కూలిన స్కూల్ భవనం
ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రాంతం సిడోర్జో పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతదేహాన్ని బయటకుతీశారు. ఇంకా శిథిలాల కిందట 65 మంది విద్యార్థులు ఉన్నాయి. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు.
సిడోర్జో పట్టణంలో నిర్మాణంలోవున్న బహుళ అంతస్తుల పాఠశాల భవనం కుప్పకూలింది సోమవారం మధ్యాహ్నం విద్యార్థులు పాఠశాల భవనంలో ప్రార్థనల కోసం గుమిగూడారు. అదే సమయంలో భవనం ఒక్కసారిగా కూలింది. వెంటనే స్పందించిన స్థానికులు 79 మంది విద్యార్థులను కాపాడారు. ఇంకా శిథిలాల కింద 65 మంది విద్యార్థులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: మయన్మార్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదు
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద ఉన్న విద్యార్థుల వయస్సు 12-17 ఏళ్ల మధ్యవారు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన విషయం తెలియగానే విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. వారి కుటుంబాల సభ్యుల రోదనలు ఆ ప్రాంతంలో మిన్నంటాయి.
ఘటన వెనుక అసలు కారణం
ఘటన వెనుక అనధికార విస్తరణ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దానివల్ల ప్రమాదం జరిగిందని అంటున్నారు. మహిళా విద్యార్థులు ప్రమాదం నుండి తప్పించున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది బాలురులే ఉన్నారని, అందులో చాలామంది ప్రాణాలతో బయటపడినట్టు స్థానిక మీడియా చెబుతోంది.
పాత ప్రార్థనా మందిరం మొదట్లో రెండు అంతస్తులు మాత్రమే ఉండేవి. మూడు, నాలుగో అంతస్తులను అనధికారికంగా నిర్మిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్నవారికి ఆక్సిజన్, నీటి సరఫరా చేస్తున్నారు. వారిని వీలైనంత త్వరగా బయటకు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు సహాయక బృందాలు చెబుతున్నాయి.
పాత ప్రార్థనా మందిరం మొదట్లో రెండు అంతస్తులు మాత్రమే ఉండేది. మూడు, నాలుగో అంతస్తులను అనధికారికంగా నిర్మిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కాంక్రీటు వేసే క్రమంలో భవనం కూలిపోయిందని చెబుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్నవారికి ఆక్సిజన్, నీటి సరఫరా చేస్తున్నారు. వీలైనంత త్వరగా బయటకు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు సహాయక బృందాలు తెలిపాయి.
❗️🇮🇩 – At least 65 students are presumed buried under the rubble after a multi-story Islamic boarding school building collapsed in Sidoarjo, East Java, Indonesia, while over 100 were gathered for afternoon prayers.
One 13-year-old student has been confirmed dead, with 99 others… pic.twitter.com/UrqHsoWg50
— 🔥🗞The Informant (@theinformant_x) September 30, 2025