BigTV English

SSMB 29: టార్గెట్ ఫిక్స్ చేసిన జక్కన్న.. అయోమయంలో మహేష్!

SSMB 29: టార్గెట్ ఫిక్స్ చేసిన జక్కన్న.. అయోమయంలో మహేష్!

SSMB 29: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు రాజమౌళి (Rajamouli ). ‘శాంతి నివాసం’ అనే సీరియల్ ఎపిసోడ్ ద్వారా డైరెక్టర్ గా కెరియర్ మొదలు పెట్టిన ఈయన.. ఆ తర్వాత సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ వన్, విక్రమార్కుడు, సై, మగధీర ఇలా పలు చిత్రాలు చేసి ఓట మెరుగని దర్శకుడిగా పేరు దక్కించుకున్నారు. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు దక్కించుకొని.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ డైరెక్టర్గా పేరు అందుకున్నారు. ఇప్పుడు రాజమౌళి – మహేష్ బాబు (Mahesh Babu) తో అంతర్జాతీయ స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘ఎస్ఎస్ఎంబి – 29’ అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.


శరవేగంగా జరుగుతున్న షూటింగ్..

షూటింగ్ అయితే జరుగుతోంది కానీ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ మాత్రం ఇప్పటివరకు వెలువడలేదని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన మెడలో ఉండే లాకెట్ ను హైలెట్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు రాజమౌళి. అప్పటినుంచి మరో అప్డేట్ లేదు. దీంతో ఈ సినిమా నుండి అప్డేట్ కోసం ఎదురుచూసిన అభిమానులకు ఈ ఏడాది నవంబర్లో అతిపెద్ద అప్డేట్ తో మీ ముందుకు వస్తానని రాజమౌళి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు సినిమా షూటింగ్ ను కూడా వేగంగా కంప్లీట్ చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది.

టార్గెట్ ఫిక్స్ చేసిన రాజమౌళి..


ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమాకి జక్కన్న టార్గెట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో 2027 మార్చి 25వ తేదీన రిలీజ్ చేయాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారట. అందులో భాగంగానే ఇప్పుడు సినిమా షూటింగ్ ను కూడా శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారట. దీంతో విడుదల తేదీకి కేవలం ఒకటిన్నర సంవత్సరం మాత్రమే ఉండడంతో ఈ సినిమా షూటింగ్ ఎలాగైనా పూర్తి చేయాలని రాజమౌళి అనుకుంటూ ఉండగా అటు మహేష్ బాబు మాత్రం అయోమయంలో పడినట్లు తెలుస్తోంది.

అయోమయంలో మహేష్ బాబు..

సాధారణంగా మహేష్ బాబు కాస్త సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి ఈయనకు ఇప్పుడు రాజమౌళి ఇంత పెద్ద టార్గెట్ ఫిక్స్ చేయడంతో మహేష్ బాబు కాస్త అయోమయంలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రాజమౌళి మాత్రం ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తూ.. ఆస్కార్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

SSMB29 మూవీ విశేషాలు..

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తోంది.. ఇప్పటికే ఈమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా దాదాపు 70% పూర్తీ అయినట్లు సమాచారం. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోందని.. ఏకంగా రూ.1200 కోట్లు ఈ సినిమా కోసం ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం.

ALSO READ:Bigg Boss 9 Promo: నామినేషన్ రచ్చ షురూ.. వ్యాలీడ్ పాయింట్స్ చెప్పండమ్మా!

Related News

Nani Sujeeth : దసరాకు నాని – సుజీత్ మూవీ.. అప్పుడే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్

Chiru vs Balayya : బాలయ్యపై మెగా ఫ్యాన్స్ వార్… 300 పోలీస్ స్టేషన్లల్లో కేసు ?

OG Film : పవన్ ఫ్యాన్స్ కు ఒకేసారి రెండు బెనిఫిట్స్, అసలైన రిజల్ట్ ఇప్పుడు తేలుతుంది

OG Movie: ఓజి సినిమాకు మరో షాక్… తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

Kantara Chapter1: చెన్నైలో కాంతార చాప్టర్ 1 ఈవెంట్ రద్దు… ఆ ఘటన కారణమా?

Pawan Kalyan : కాంతారా ఛాప్టర్ 1 కి ఆటంకాలు పెట్టొద్దు, పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Devara 2: దేవర 2 లో కోలీవుడ్ స్టార్… గట్టిగానే ప్లాన్ చేస్తున్న కొరటాల!

Big Stories

×