Today Gold Rate: అరే ఏంట్రా ఇది.. బంగారం ధరలు ఇలా పెరుగుతున్నాయి. రోజు ఇలా పెరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏం కావాలి.. ముందుగా చెప్పినట్టు బంగారం ధరలు 2 లక్షలు అయ్యేలా ఉంది. ఒక్క రోజే బంగారం ధరలు ఇలా పెరిగితే ఇంకా బంగారం ఎవరు కొంటారు. బంగారం పై ప్రజలు మొగ్గె చూపడం తగ్గిస్తారు. పాపం బంగారం తగ్గుతది అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పసిడి ప్రియులు ఆశలు చంపుకుంటున్నారు.
భారీగా పెరిగిన బంగారం ధరలు..
అయితే ప్రస్తుతం నేడు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,890 కాగా.. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,310 వద్ద పలుకుతోంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,150 ఉండగా.. సోమవారం రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,08,450 వద్ద ఉంది. అంటే ఒక్కరోజుకు రూ. 1,420 పెరిగిందని చెప్పవచ్చు.
పగపట్టిన పసిడి..
బంగారం ధరలు రోజురోజుకు పరుగులు ఆగకుండా పోతున్నాయి. రోజూ వేయిలలో పెరుగుతుంది. ఇలా పెరిగితే ప్రజలు బంగారం కొనడం ఎలా సాధ్యం అంటున్న పసిడి ప్రియలు.. బంగారం తగ్గినట్టే తగ్గి ఎందుకు మళ్లీ ఇంతలా పెంచుతున్నారని పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఎందుకు బంగారం ధరలు ఇలా పెరుగుతున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిపుణులు చెప్పినట్టు బంగారం 2 లక్షలు అవుతుందా? లేదా ముందు ముందు ఇంకా తగ్గుతుందా? అని సందిగ్ధంలో ఉన్నారు.
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,18,310 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,08,700 వద్ద ఉంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,16,400 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,06,700 వద్ద కొనసాగుతుంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,16,400 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,06,700 వద్ద పలుకుతుంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,16,550 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,06,850 వద్ద ఉంది.
Also Read: మూసీ ఉగ్రరూపం.. హైడ్రా ఆన్ యాక్షన్.
నేటి సిల్వర్ ధరలు ఇలా..
బంగారం ధరల బాటలోనే సిల్వర్ కూడా నడుస్తోంది. వాటికి ఏమాత్రం తగ్గకుండా సమానంగా సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,60,000 కాగా మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ.1,61,000 వద్ద కొనసాగుతుంది. అంటే ఒక్కరోజే సిల్వర్ ధరలు కేజీపై రూ. 1,000 పెరిగింది. అలాగే కలకత్తా, ముంబై, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధరలు రూ. 1,50,000 వద్ద కొనసాగుతోంది.