Chiru vs Balayya : చిరంజీవి వర్సెస్ బాలయ్య ఎపిసోడ్ పీక్స్‌కి వెళ్తుంది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి లేటర్ ద్వారా ఇప్పటికే స్పందించాడు. దీని తర్వాత చిరు నుంచి రియాక్షన్ లేదు. నిన్న (సోమవారం) ఎయిర్‌పోర్ట్‌లో కూడా బాలయ్య చేసి వ్యాఖ్యలపై రియాక్ట్ అవ్వడానికి నిరాకరించాడు. మెగాస్టార్ సైలెంట్‌గా ఉన్నా.. మెగా అభిమానులు మాత్రం బాలయ్యపై యుద్దం ప్రకటించారు. చిరంజీవిని అవమానించిన బాలయ్యపై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.
నిన్న (సోమవారం) సాయంత్రం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర అఖిల భారత చిరంజీవి యువత ఆందోళన చేశారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర పెద్ద సంఖ్యలు అభిమానులు చేరుకున్నారు. బాలయ్య వ్యాఖ్యలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు కూడా వెళ్లారు. అయితే, ఆ విషయం తెలుసుకున్న మెగాస్టార్… బాలయ్యపై ఫిర్యాదు వద్దని, అది మన సంస్కారం కాదు అంటూ అభిమానులకు చెప్పాడు.
చిరు మాటలతో అప్పుడు కూల్ అయినా… అభిమానులు బాలయ్యపై ఫిర్యాదు చేయలేదు. తాజాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకునేంత వరకు తమ ఆందోళన విరమించేదే లేదని స్పష్టం చేశారు.
తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బాలకృష్ణపై కేసు నమోదు చేశారు. అలాగే ఈ రోజు ఆంధ్రా, తెలంగాణ మెగా అభిమానులు అత్యవసర సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది. రెండు రాష్ట్రాల్లో దాదాపు 300 పోలీస్ స్టేషన్స్‌లో బాలయ్యపై ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
అయితే, ఈ విషయం తెలుసుకున్న.. చిరంజీవి.. అభిమానులపై ఫైర్ అయినట్టు సమాచారం. బాలయ్యపై ఎలాంటి ఫిర్యాదులు చేయొద్దు అని అఖిల భారత చిరంజీవి యువత చిరంజీవి సూచించారట. దీంతో ఇప్పటికి అభిమానులు శాంతించినట్టు తెలుస్తుంది. అయితే, చిరంజీవికి బాలయ్య తప్పకుండా క్షమాపణలు చెప్పాల్సిందే అని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
అయితే, చిరంజీవి వర్సెస్ బాలయ్య అని చాలా ఏళ్ల నుంచి సినిమా కెరీర్ వల్ల ఇది స్టార్ట్ అయింది. చాలా సందర్భల్లో ఈ సీనియర్ హీరోల అభిమానుల మధ్య సోషల్ వార్ కూడా జరిగింది. అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ, తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడటం వల్ల బాలయ్య – చిరంజీవి మధ్య ఉన్న వివాదాలు అన్నీ కూడా ముగిశాయని అనుకున్నారు.
అయితే, బాలయ్య ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో మరోసారి వీరి మధ్య ఉన్న వివాదాలు బయటపడ్డాయి. బాలయ్య వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా చిరంజీవి కూడా లెటర్ రాశాడు. దీంతో హీరోల మధ్య ఉన్న వివాదం కాస్త… అభిమానుల వరకు చేరింది. ఇక అభిమానులు… బాలయ్య క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ గత కొన్ని రోజుల నుంచి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు.