E-Paper
Advertisement

ట్రావెల్స్‌ కు బెస్ట్ ఛాయిస్.. టాటా 9 సీటర్ లగ్జరీ వెహికల్ కొనేయండి బ్రో!

ట్రావెల్స్‌ కు బెస్ట్ ఛాయిస్.. టాటా 9 సీటర్ లగ్జరీ వెహికల్ కొనేయండి బ్రో!
Advertisement

Tata Winger Plus 9-Seater: ట్రావెల్ కు అనుకూలంగా ఉండే సూపర్ మోడల్ ను టాటా మోటార్స్ తీసుకొచ్చింది. కొత్త వింగర్ ప్లస్ ను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. రూ.20.60 లక్షల(ఎక్స్‌ షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చిన ఈ 9-సీటర్ వెహికల్.. రవాణా, ట్రావెల్ సంస్థలు, టూరిజం రంగాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించింది. సాధారణ ప్యాసింజర్ వాహనాల కంటే ఎక్కువ సౌకర్యాలను అందించేలా వింగర్ ప్లస్‌ ను డిజైన్ చేసింది. ఎక్కువ దూరం సౌకర్యవంతంగా ప్రయాణించేలా తయారు చేసింది. అందుకే ప్రయాణికుల కోసం పలు ప్రీమియం ఫీచర్లను ఇందులో అందించింది.

రిక్లైనింగ్ కెప్టెన్ సీట్లు

వింగర్ ప్లస్‌ లో రిక్లైనింగ్ కెప్టెన్ సీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రతి సీటుకు సర్దుబాటు చేసుకునే ఆర్మ్‌ రెస్ట్‌ లు ఉండటంతో ప్రయాణం మరింత సౌకర్యంగా ఉంటుంది. అలాగే ప్రతి ప్రయాణికుడి కోసం ప్రత్యేక USB ఛార్జింగ్ పోర్ట్, పర్సనలైజ్డ్ ఏసీ వెంట్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో లాంగ్ ట్రిప్‌ లలో కూడా ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ వెహికల్ మోనోకోక్ ఛాసిస్ ఆధారంగా రూపొందించబడింది. దీని వల్ల సాధారణ కమర్షియల్ వాహనాల కంటే కారు మాదిరి డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ లభిస్తుంది. డ్రైవర్‌కు మెరుగైన నియంత్రణతో పాటు ప్రయాణికులకు కూడా సాఫీగా ప్రయాణించే అనుభూతిని అందించేలా దీనిని తయారు చేసింది.

విశాలమైన క్యాబిన్

Advertisement

క్యాబిన్ కూడా చాలా విశాలంగా ఉండేలా రూపొందించారు. ప్రయాణికులకు కూర్చోవడానికి తగినంత స్థలంతో పాటు పెద్ద లగేజ్ కంపార్ట్‌ మెంట్ కూడా అందుబాటులో ఉంది. దీంతో ఎయిర్‌ పోర్ట్ పికప్‌ లు, కార్పొరేట్ ట్రాన్స్‌ పోర్ట్, టూరిస్ట్ ట్రిప్‌ లకు ఈ వెహికల్ అనుకూలంగా ఉంటుంది.

ఇంజిన్ గురించి..

ఇందులో 2.2 లీటర్ డైకోర్ డీజిల్ ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్ 99 బీహెచ్‌పీ పవర్, 200 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ కమర్షియల్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని పనితీరు, ఇంధన సామర్థ్యానికి బ్యాలెన్స్ ఉండేలా టాటా దీనిని రూపొందించినట్లు తెలిపింది.

Advertisement

అటు టెక్నాలజీ పరంగా కూడా వింగర్ ప్లస్ ఆధునికతను సంపాదించుకుంది. ఈ వాహనం ఎక్కడ ఉందో రియల్‌ టైమ్‌ లో ట్రాక్ చేయడం, వాహనం పనితీరును పర్యవేక్షించడం, అవసరమైన డయాగ్నోస్టిక్స్ తెలుసుకోవడం, ఫ్లీట్ మెయింటెనెన్స్ చేయడం లాంటి సౌకర్యాలు లభిస్తున్నాయి.సౌకర్యవంతమైన సీటింగ్, ఆధునిక ఫీచర్లు, విశాలమైన క్యాబిన్, పవర్ ఫుల్ డీజిల్ ఇంజన్, కనెక్టెడ్ టెక్నాలజీతో వచ్చిన టాటా వింగర్ ప్లస్.. సిబ్బంది రవాణా, ట్రావెల్ ఆపరేటర్లు, టూరిజం రంగానికి మరింత ఉపయోగపడనుంది.

Read Also: సెకెండ్ హ్యాండ్ కార్లలో ఈ MPVకే ఎక్కువ డిమాండ్.. 5 ఏళ్ల తర్వాత కూడా ధర తగ్గదు!

Related News

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

హ్యుందాయ్ బేయాన్ N లైన్ వచ్చేసింది.. టర్బో పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా!

డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?

కవాసకి వెర్సిస్ 900 వచ్చేసింది, భారత్‌లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

భారత్‌ పై విన్‌ఫాస్ట్ ఫుల్ ఫోకస్.. తెలంగాణ, ఏపీలోనూ షోరూమ్‌లు!

కొత్త కలర్, సరికొత్త ఫీచర్లు.. MG విండ్సర్ EV కొత్త ఎడిషన్ వచ్చేసింది!

మహీంద్రా XUV 3XO CNG టీజర్ విడుదల.. అక్టోబర్ 15న ఆవిష్కరణ!

Big Stories

Advertisement
×