E-Paper
Advertisement

ఈవారం ఓటీటీలోకి వచ్చిన 5 అచ్చతెలుగు సినిమాలు… అస్సలు మిస్ అవ్వొద్దు

ఈవారం ఓటీటీలోకి వచ్చిన 5 అచ్చతెలుగు సినిమాలు… అస్సలు మిస్ అవ్వొద్దు
Advertisement

Best Telugu OTT Movies: వీకెండ్ వచ్చేసిందోచ్. హాయిగా ఇంట్లోనే రిలాక్స్ అవుతూ, ఎంచక్కా కావాల్సిన సినిమాలను చూడగలిగే బెస్ట్ టైమ్ వీకెండే. వారమంతా ఆఫీసు పనులు, ట్రాఫిక్, డెడ్‌లైన్స్‌తో బిజీగా గడిపే మనకు శని-ఆదివారాలు వచ్చాయంటే చాలు… కాస్త రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది కదా. థియేటర్లకు వెళ్లే ఓపిక లేని వారు ఇంట్లోనే కూర్చుని ఓటీటీలో మంచి కంటెంట్ వెతుక్కుంటారు. అలాంటి వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇష్టపడే మీ కోసం ఈ సండే స్పెషల్ లిస్ట్ తీసుకొచ్చాం. ఒక్కోటి ఒక్కో రకంగా ఉండే ఈ టాప్ 5 కంటెంట్‌ లు మీ వీకెండ్‌ ను ఇంకా స్పెషల్ చేస్తాయి. మరి ఈ వారం ఓటీటీలో అందుబాటులో ఉన్న ఆ అచ్చతెలుగు సినిమాలు ఏంటి ? వాటిని ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

1. పెద్ది (Peddi)

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ఈ వారమే ఓటీటీలోకి వచ్చింది. బయటిప్రపంచానికి అంతగా తెలియని ఒక మారుమూల గ్రామం, ఆ ఊరికి చెందిన అథ్లెట్, తన విలేజ్ కి గుర్తింపు తీసుకురావడం కోసం చేసే పోరాటమే ఈ సినిమా. రామ్ చరణ్ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ మూమెంట్స్, స్పోర్ట్స్ థీమ్ అన్నీ కలిసి మాస్ ఎంటర్‌టైనర్‌ లా ఉంటుంది ఈ మూవీ. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం త్వరలోనే హిందీలో కూడా వస్తోంది.

2. గుర్తుకొస్తున్నాయి (Gurthukostunnayi)

Advertisement

హయ్యెస్ట్ ఐఎమ్‌డీబీ రేటింగ్‌ 9.4తో దూసుకుపోతున్న సరికొత్త తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’. విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా, వివా రాఘవ్, రోహిణి హట్టంగడి ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ 7 ఎపిసోడ్ల సిరీస్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. సంతోష్ అనే యువకుడు తన చిన్ననాటి స్నేహితురాలు వైశాలిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. కానీ, సరిగ్గా పెళ్లికి ముందే అతను తన జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. ఆ తర్వాత జరిగిన సిల్లీ అండ్ ఫన్నీ ఇన్సిడెంట్స్ కథే ఈ సిరీస్‌.

3. సూపర్ సుబ్బు (Super Subbu) 

ఈ లిస్టులో ఉన్న మరో మస్ట్ వాచ్ తెలుగు ఓటీటీ సిరీస్ ‘సూపర్ సుబ్బు’. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ వెర్షన్ ఆడియోతో అందుబాటులో ఉన్న ఈ 7 ఎపిసోడ్ల సిరీస్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఫ్యామిలీ కామెడీ డ్రామా. ఒక గ్రామంలో అడల్ట్ ఎడ్యుకేషన్ నేర్పించాల్సిన బాధ్యత హీరోపై పడుతుంది. తన కోపిష్టి తండ్రి కంట పడకుండా, ఊరి పెద్దల నుంచి తప్పించుకుంటూ ఆ హీరో తన బాధ్యతను ఎలా పూర్తి చేశాడనేది ఈ సిరీస్ కథ. !

4. సింగ్ గీతం (Sing Geetham)

Advertisement

ఐఎమ్‌డీబీలో 6.4 రేటింగ్ ఉన్న అవుట్ అండ్ అవుట్ మ్యూజికల్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘సింగ్ గీతం’. అహల్యా బామ్రూ, అయాన్, శాలిని కొండెపూడి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా హిలేరియస్‌గా ఉంటుంది. డబ్బు పిచ్చి ఉన్న ఒక వ్యక్తి తన సొంత గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత, అక్కడ దాగి ఉన్న గుప్త నిధి వివాదంలో ఎలా చిక్కుకున్నాడనేది ఆసక్తికరంగా చూపించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

5. బ్లాస్ట్ (Blast)

ఇక చివరగా ఈ లిస్ట్ లో ఉన్నది యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ క్రైమ్ డ్రామా ‘బ్లాస్ట్’. ఒక మధ్యతరగతి కుటుంబం అనుకోకుండా డేంజరస్ గ్యాంగ్‌స్టర్‌తో గొడవలో ఇరుక్కుంటుంది. ఆ విపత్కర పరిస్థితి నుంచి బయటపడటానికి ఆ కుటుంబంలోని మార్షల్ ఆర్ట్స్ ప్రతిభ ఎలా ఉపయోగపడిందనే పాయింట్తో తెరకెక్కిన సినిమా ఇది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటు ఉంది.

Read Also: అనుకోకుండా హత్య కేసులో చిక్కుకునే ఫ్యామిలీ… మతిపోగొట్టే మలయాళం మిస్టరీ థ్రిల్లర్

Tags

Related News

ఓటీటీలోకి వచ్చేస్తున్న కొరియన్ కనకరాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

మోగ్లీని రక్షించడానికి వచ్చిన విచిత్ర మృగం… కట్ చేస్తే 20 ఏళ్ల సీక్రెట్ బట్టబయలు… తెలుగులోనే స్ట్రీమింగ్

మొగుడు పెళ్లాల మధ్యలోకి వచ్చి ముంచేశాడు… క్లైమాక్స్‌లో ఊహించని డ్రామా… తెలుగులో ఇంగ్లీష్ సిరీస్

మహిళల ఇళ్లకు వచ్చే విచిత్రమైన బాక్సులు… కట్ చేస్తే వరుస హత్యలు… ప్రతి కేసు వెనుక ఒకే మైండ్

మ్యాచ్ ఆడుతుంటే స్టేడియంలో పదే పదే వినిపించే సీక్రెట్ విజిల్… శబ్దంతో కోచ్ కొంపముంచిన లేడీ

రాత్రికి రాత్రే రాక్ స్టార్ శవంగా… తీరా శవం దగ్గరకు వెళ్తే ఊహించని షాక్… డార్క్ హారర్ థ్రిల్లర్

కూతురి సీక్రెట్ డైరీతో స్టేజ్‌పై జోకులు… నిజం తెలిసి నిలదీసిన కూతురికి షాకింగ్ ట్విస్ట్… తెలుగులోనే ఈ సిరీస్

Big Stories

Advertisement
×