E-Paper
Advertisement

Mumbai: పవార్‌ను చంపేస్తాం.. రౌత్‌ను లేపేస్తాం.. వార్నింగ్ బెల్స్..

Mumbai: పవార్‌ను చంపేస్తాం.. రౌత్‌ను లేపేస్తాం.. వార్నింగ్ బెల్స్..
Advertisement
sharad sanjay

Mumbai: నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌ను చంపేస్తామంటూ కొందరు దుండుగులు బెదిరింపులకు దిగారు. పవార్‌ను హత్య చేస్తామని ట్విట్టర్‌లో బెదిరించారు. ఈ బెదిరింపులపై శరద్ పవార్‌ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే ముంబై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. బెదిరింపులు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

తన తండ్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను ట్విట్టర్‌లో కొందరు బెదిరించారని.. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. శరద్‌ పవార్‌కు ఏదైనా జరిగితే రాష్ట్ర హోం మంత్రి బాధ్యత వహించాలన్నారు. ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి జోక్యం చేసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Advertisement

మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్, ఆయన సోదరుడు సునీల్ రౌత్‌లకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. కాల్స్ ద్వారా కొందరు దుండగులు బెదిరించారని సునీల్ రౌత్ తెలిపారు. మీడియాతో మాట్లాడవద్దని ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్‌కు, తనకు హత్య బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. ఈ ఘటనపై ముంబై పోలీస్ కమిషనర్, రాష్ట్ర హోంమంత్రికి సమాచారం అందించామని సునీల్ రౌత్ తెలిపారు.

సుప్రీయా ఫిర్యాదుపై ముంబై పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. FIR నమోదు చేసి.. బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తిస్తామన్నారు ముంబై పోలీసులు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×