E-Paper
Advertisement

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి
Advertisement

Car Accident: ఒకే కుటుంబంలో వెలుగులు నింపాల్సిన పండగ వేళ, ఆ ఇంట్లో తీరని శోకం అలముకుంది. ఉజ్జయినిలోని బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని, తమ కష్టాలు తీర్చమని వేడుకోవడానికి బయలుదేరిన ఆ కుటుంబ సభ్యులను విధి జలపాతం రూపంలో బలి తీసుకుంది.

మార్గమధ్యంలో ఊహించని ప్రమాదం

Advertisement

ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని జయదేవ్ విహార్‌ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది కారులో మధ్యప్రదేశ్ బయలుదేరారు. ప్రయాణం సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో.. మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లా నల్కేద వద్ద వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. సమీపంలోని లోతైన జలపాతంలోకి వేగంగా దూసుకెళ్లింది.

ఎనిమిది మంది దుర్మరణం

Advertisement

ఈ ఘోర ప్రమాదంలో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పసిపిల్లలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు సమాచారం. చిన్న పిల్లలతో సహా కుటుంబమంతా ఇలా ఒకేసారి జలసమాధి కావడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్తూ మార్గమధ్యలోనే ఆ కుటుంబం అనంత లోకాలకు చేరుకోవడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Also Read: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు చుక్కలు చూపిస్తాం: బండి సంజయ్‌

Tags

Related News

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

ఢిల్లీలో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సమిట్.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!

ఐఐటీ బొంబాయిలో తీవ్ర విషాదం.. చాట్‌జీపీటీ కాపీయింగ్ రచ్చ.. విద్యార్థి ఆత్మహత్య!

లా స్టూడెంట్ అమృత హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్!

నందిగామ్ బైపోల్లో బిగ్ ట్విస్ట్.. మమత మద్దతు ఇచ్చిన గంటల వ్యవధిలో.. కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్!

హనీమూన్‌లో దంపతుల మధ్య మంటలు.. నవ వధువుకి తీవ్రగాయాలు, డార్జిలింగ్‌లో ఘటన

Big Stories

Advertisement
×